Gangula Kamalakar : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని లోయర్ మానేరు జలాశయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. అధికారులను అడిగి నీటి సమర్థ్య విలువలను తెలుసుకున్నారు ఎమ్మెల్యే గంగుల. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో మళ్ళా తాగునీటి సమస్య, నీటి యుద్ధం మొదలైందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్చి నెలలో ఇంత డెడ్ స్టోరేజీకి ఎప్పుడు వెళ్ళలేదని ఆయన వ్యాఖ్యానించారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తాగునీటికి కరీంనగర్ ప్రజలు ఇబ్బందులు పడడం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఇన్చార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎల్లంకి కనీసం 13 టీఎంసీల నీరును నింపే ప్రయత్నం చేయాలన్నారు. ఎల్ఎండీ నుండి దిగువకు నీరు వెళ్తున్నది కానీ పైనుండి ఎల్ఎండీకి నీరు రావడం లేదని ఆయన అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కడితే ఆ నీరు ఏమైనా కలుషితంగా మారినాయా అని ఆయన ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ మీద ఉన్న కోపంతో కాలేశ్వరం ప్రాజెక్టును రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నాడని గంగలు కమలాకర్ మండిపడ్డారు. ఎల్ఎండీ ప్రాజెక్టులోకి నీరు నింపకపోతే ఏప్రిల్ 5వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇసుక బస్తాలతో నీరును ఆపేస్తామని ఆయన అన్నారు.
Devendra Fadnavis: 2029 తర్వాత కూడా మోడీనే ప్రధాని.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు కౌంటర్..