గొప్ప విజనరీ ఉన్న నేత, స్మితప్రజ్ఞశాలీ మోడీ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. స్కాములకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రంత అవినీతి చరిత్ర.. ఎండ్లకు ఏండ్లు అవమాన పడి, కొట్లాడి, ఎదురునిలిచి త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. రేవంత్ వల్ల తెలంగాణ ఆతగౌరవం దెబ్బతిన్నదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచారన్నారు..
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై "మైడియర్ డాడీ" అంటూ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖ రాశారు. పార్టీ లీడర్స్‌కు యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఆరోపణ చేశారు.. బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదని ప్రశ్నించారు.. పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖలో పేర్కొన్నారు. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖ రాశారు…
Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేసినా తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ, ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారని ఆయన వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు.…
Malla Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన హాస్యశైలితో నవ్వులు పూయించారు. పంచ్ డైలాగులతో సామాజిక మాధ్యమాల్లో తరచూ ట్రెండింగ్‌లో ఉండే మల్లారెడ్డి, తాజాగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఆసక్తి రేకెత్తించాయి. ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ, “నేను రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ప్రభుత్వానికి రూ. 1100 కోట్లు లాభం వచ్చే అంశం, రెండోవది మా మేడ్చల్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, కౌన్సిలర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి” అని…
Kishan Reddy : యాదాద్రి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో మీట్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకుందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు అడిగే ధైర్యం లేకనే తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదన్నారు కిషన్…
Kadiyam Srihari: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. సుప్రీం కోర్టులో ఉన్న MLAల అనర్హత కేసుపై ఈ నెల 10న తీర్పు వెలువడనుంది. ఈ తీర్పును తాను తప్పకుండా శిరసావహిస్తానని ఆయన స్పష్టంగా తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం ఉపఎన్నికలు జరిగితే, తాను తప్పకుండా పోటీ చేస్తానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఇందులో వెనుకడుగు తీసుకునే ఆలోచన లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. BRS పార్టీపై తీవ్ర…
KTR : తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ కార్ రేసును రాష్ట్రానికి తీసుకువచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్‌ను ప్రధాన గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక దృష్టితో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించామని తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఇన్నోవేషన్, రీసెర్చ్, , తయారీ రంగాల్లో పెట్టుబడులు అందించడం ద్వారా ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ ప్రధాన…
ఒక రాజకీయ పార్టీని వదిలి బయటికి వెళ్ళే నాయకులు ఆ పార్టీని విమర్శించడం, పరిస్థితినిబట్టి వీలైనంత ఎక్కువ బురద చల్లేయడం ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. అటు పార్టీలు కూడా ఒక నాయకుడు బయటికి వెళ్ళిపోతున్నాడన్న ఫీలర్ రాగానే... ముందే బహిష్కరించడమో... లేదా పొమ్మనకుండా పొగబెట్టడమో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫలానా పార్టీని నమ్ముకుని చెడ్డవాళ్ళనో, లేక ఫలానా పార్టీ అధ్యక్షుడి వైఖరితో నష్టపోయిన వాళ్ళనో... రకరకాల చర్చలు జరుగుతుంటాయి పొలిటికల్ సర్కిల్స్‌లో.
గులాబీ పార్టీ ట్రాక్ అండ్ ట్రెండ్ మార్చాలనుకుంటోందా? పోగొట్టుకున్న చోటే వెదుక్కునే ప్లాన్‌కు పదును పెడుతోందా? అటు సీనియర్స్‌ని సంతృప్తి పరచడం, ఇటు పార్టీ అవసరాలు తీర్చుకోవడమన్న రెండు పిట్టల్ని ఒకే దెబ్బకు కొట్టాలనుకుంటోందా? జనంలోకి దూకుడుగా వెళ్ళడానికి బీఆర్‌ఎస్ వేస్తున్న కొత్త స్కెచ్ ఏంటి? దాని మీద పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది?
ఒకప్పుడు మేమే కింగ్‌లమని అన్నారు. మా మాటకు ఎదురే లేదంటూ రీ సౌండ్ ఇచ్చారు. తీరా.. ఇప్పుడు బయటికి వస్తే డబ్బులు ఖర్చు అనుకుంటూ.. కామ్ సినిమా చూస్తున్నారు. అసలే కష్టాల్లో ఉన్నాం... డీజిల్ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయ్... ఇప్పుడెందుకు రా బుజ్జా అన్ని బళ్ళు... అంతా కలిసి ఒక బండిలో సర్దుకోండన్న పాపులర్ మూవీ డైలాగ్‌ని గుర్తు చేసుకుంటూ... జాగ్రత్త పడుతున్నారట. ఎవరా లీడర్స్? ఏంటి వాళ్ళకు వచ్చిన కష్టం.