Jagadish Reddy : సూర్యాపేట జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, “రేవంత్ భాషలో ఎలాంటి మార్పు రాలేదు. సీఎం అనే సోయిలేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన భాష తీరే ఆయనను బొందపెడుతుంది” అంటూ మండిపడ్డారు. “15 నెలలు గడిచినా కేసీఆర్ ప్రస్తావన లేకుండా సభలు సాగడం లేదు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ, “ప్రజలు ఆరు గ్యారంటీలను నమ్మి మోసపోయారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది” అని జగదీష్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇస్తామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం NDSP సాకుతో కాళేశ్వరం నీళ్లు రాకుండా అడ్డుకుంటోందన్నారు. రైతులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి అని సూచించారు జగదీష్ రెడ్డి.
ప్రభుత్వం బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ధాన్యం కొనడం లేదని ఆయన ఆరోపించారు. ఎంత ధాన్యం కొన్నారు, ఎంత బోనస్ ఇచ్చారు? ప్రభుత్వం వద్ద సమాధానం లేదు అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. “హుజూర్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఆయనకు కేసీఆర్‌ను తిట్టడం తప్ప వేరే పని లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విషం కక్కి ప్రజాక్షేత్రంలో బతకడం చాలా కష్టం. ప్రజలే త్వరలో కాంగ్రెస్ పార్టీకి తీర్పు చెప్తారు. కేసీఆర్ గురించి మాట్లాడనిదే రేవంత్ రెడ్డికి పూట గడవదు. గత ఏడాది కొన్న సన్న వడ్లు ఎన్ని? ఇచ్చిన బోనస్ ఎంత? సమాధానం చెప్పాలి” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తన విమర్శలు గుప్పించారు జగదీష్ రెడ్డి.
Meerut murder case: జైల్లో నిందితులకు రామాయణం అందజేసిన నటుడు