గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే… ఆ గ్రామాభివ్రుద్ది కోసం ప్రత్యేకంగా రూ.10 లక్షల నిధులను అందజేస్తానని కేంద్ర మంత్రి ప్రకటించారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివ్రుద్ధి వైపు ద్రుష్టి సారించేలా ప్రోత్సహించేందుకే ఈ నిధులను ప్రకటించాలని…
Bandi Sanjay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన బండి సంజయ్ మీటింగ్‌ను నిలిపేశారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపడుతున్నారు. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు ప్రశ్నించారు.
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లతో హైదరాబాద్‌లోని సాగర్ సొసైటీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి…
Union Minister Kishan Reddy: ఏడాది పాటుగా పటేల్ ఉత్సవాలు జరుపుతామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పటేల్ రాజకీయ నేత కాదు రైతాంగ ఉద్యమ నేత అని కొనియాడారు. తాజాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పటేల్ అంటే కాంగ్రెస్ పార్టికి నొప్పి.. పీవీ నరసింహారావు అంటే కాంగ్రెస్ కు నచ్చదన్నారు. కేవలం నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్ నచ్చుతుందని విమర్శించారు.కాంగ్రెస్ కు దేశమంటే నెహ్రూ, నెహ్రూ అంటే…
Bobba Navatha Reddy : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ.. రెండు పార్టీలకూ వరుసగా కీలక నేతల రాజీనామాలు షాక్ ఇస్తున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఆదివారం తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని విడిచిపోతున్నట్లు పేర్కొంటూ, ఇంతకాలం సహకరించిన పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా…
Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెంగళ్ రావు నగర్ డివిజన్, మధురానగర్‌లో ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై, మజ్లిస్ పార్టీ పెట్రేగిపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆదివారం ముఖ్యమైన నాయకులు భారీ ఎత్తున పాల్గొంటారని ఆయన తెలిపారు. స్నాప్‌డ్రాగన్ 8 Elite Gen 5, 7560mAh బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా…
Etela Rajender: బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారు. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీ బంద్‌లో భాగంగా జూబ్లీ బస్టేషన్ వద్దకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని తెలిపారు.
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిన పార్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఢిల్లీ పెద్దల నుంచి సూచనలు వచ్చినట్లు సమాచారం. దీనితో ఆ దిశగా ఆలోచించాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి పేరుపై సస్పెన్స్ మరింత పెరిగింది. ప్రస్తుతం దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, డాక్టర్…
హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై వాదనలు సమర్థవంతంగా వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. “కేంద్ర మంత్రిగా నేను ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రపతిగారు కూడా ఏం చేయలేరు,” అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వమే ఉన్నప్పటికీ,…
Telangana BJP Meeting: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం, నేడు (అక్టోబర్ 5) రాష్ట్ర పదాధికారుల అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేయడం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కీలక చర్చ జరిగింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం మరియు అభ్యర్థి ఎంపికపై కూడా చర్చించే అవకాశం…