POCO C71: 6.88 అంగుళాల 120Hz డిస్ప్లే, 5200mAh బ్యాటరీతోపాటు సూపర్ ఫీచర్స్ తో రాబోతున్న పోకో C71
- ఏప్రిల్ 4న భారతదేశంలో విడుదలకానున్న POCO C71.
- 6.88 అంగుళాల 120Hz డిస్ప్లే, 5200mAh బ్యాటరీ
- 32MP కెమెరాతో పాటు సెకండరీ కెమెరా, అలాగే 8MP సెల్ఫీ కెమెరా.
- 6GB RAM, ఆండ్రాయిడ్ 15 తో వస్తున్న POCO C71.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POCO C71: స్టైలిష్, మెరుగైన కెమెరాల ఫోన్స్ ను అందిస్తున్న పోకో సంస్థ భారీ ఫ్యాన్ బేస్ ను కలిగి ఉంది. వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తూ వస్తోంది. ఇకపోతే, గత ఏడాది విడుదలైన POCO C61 స్మార్ట్‌ఫోన్‌కు అప్డేటెడ్ గా ఏప్రిల్ 4న భారతదేశంలో కంపెనీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ POCO C71ని విడుదల చేయనున్నట్లు POCO ధృవీకరించింది. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD+ 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుందని POCO తెలిపింది. ఇందులో TUV తక్కువ బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సిర్కాడియన్ సర్టిఫికేషన్‌లు ఉన్నాయి. ఇది వెట్ డిస్‌ప్లే సపోర్ట్‌తో వస్తుంది.
Read Also: Sharwanand : శర్వానంద్ ‘నారి నడుమ మురారి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
POCO C71 పవర్ బ్లాక్, కూల్ బ్లూ, డెసర్ట్ గోల్డ్ వంటి మూడు రంగులలో వస్తుంది. దుమ్ము, ఫ్లాష్ నిరోధకత కోసం IP52 రేటింగ్‌లను కలిగి ఉంది. POCO ఈ ఫోన్ కోసం 5200mAh బ్యాటరీని అందిస్తుంది. ఇది ఈ బడ్జెట్ విభాగంలో అతిపెద్దది అని తెలిపింది. ఇది ఛార్జర్‌తో 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సపోర్ట్ వస్తుంది. దీనితో ముఖ్యంగా 3 సంవత్సరాల తర్వాత కూడా 80% బ్యాటరీ ఆరోగ్యాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. 32MP వెనుక కెమెరాతో పాటు సెకండరీ కెమెరా, అలాగే 8MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను అందిస్తోంది POCO. ఈ మొబైల్ 6GB RAM కలిగి ఉండి 6GB అదనపు వర్చువల్ RAM ను పెంచుకోవచ్చు. ఇది మైక్రో SD విస్తరణ స్లాట్‌తో కూడా వస్తుంది. ఇందులో స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
Read Also: Mad Square Director : ఈ స్థాయి అస్సలు ఊహించలేదు.. నాకు అత్యుత్తమ ప్రశంస అదే!
ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. POCO ఈ ఫోన్ కు 2 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌ను హామీ ఇస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 7000 ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..