BSNL Recharge: ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం కొనసాగే ప్లాన్‌లను ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకంగా డ్యూయల్ సిమ్ వినియోగదారులు, తమ రెండో నంబర్‌ను తక్కువ ఖర్చుతో కొనసాగించాలనుకునే వారు దీర్ఘకాలిక ప్లాన్‌ల గురించి చూస్తుంటారు. అలంటి వారికి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఒక సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వినియోగదారులు కాల్, డేటా, SMS వంటి ప్రయోజనాలను పొందుతూ ప్రతి నెల రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా నిశ్చింతగా ఉండవచ్చు.
Read Also: WhatsApp Update: ఇకపై వాట్సాప్ స్టేటస్లో మ్యూజిక్.. ఎలా పెట్టుకోవాలంటే?
BSNL రూ.1,198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇది 365 రోజుల సర్వీస్‌ను అందిస్తుంది. దీని ప్రధాన లక్ష్యం వినియోగదారులకు ప్రతి నెల రీఛార్జ్ చేసే భారం నుండి విముక్తి కల్పించడం. నిరంతర కనెక్టివిటీ కోరుకునే వినియోగదారులకు ఇది ఆర్థికంగా చౌకైన, ప్రయోజనకరమైన ప్లాన్ గా మంచి ఆదరణ పొందింది. ఈ ప్లాన్ ద్వారా ప్రతి నెల 300 నిమిషాల వాయిస్ కాలింగ్ తో పాటు ఫ్రీ నేషనల్ రోమింగ్ అందించబడుతుంది. అంటే, వినియోగదారులు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా కనెక్టివిటీ కోల్పోకుండా BSNL నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు.
Read Also: ABD: జట్టు ఇప్పుడు సరైన బ్యాలెన్స్‌గా ఉంది.. ఈసారి చాలా స్ట్రాంగ్ గా ఉంది
ఇక మొబైల్ డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం ఈ ప్లాన్ లో ప్రతి నెల కేవలం 3GB డేటా అందిస్తుంది. దీని ద్వారా బ్రౌజింగ్, స్ట్రీమింగ్, సోషల్ మీడియా యాక్టివిటీలు కొనసాగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి నెల 30 ఫ్రీ SMSలు లభిస్తాయి. ఇవి తక్కువగా మెసేజింగ్ చేసే వినియోగదారులకు బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఇకపోతే, Airtel, Jio, Vi ఇప్పటికే భారతదేశంలోని పలు నగరాల్లో 5G సేవలను ప్రారంభించాయి. కానీ BSNL 5G సేవలను ఇంకా ప్రారంభించలేదు. నివేదికల ప్రకారం, 2025 జూన్ నాటికి అనేక ప్రధాన నగరాల్లో 5G సేవలను ప్రారంభించే యోచనలో ఉంది. అప్పటి వరకు BSNL 4G నెట్‌వర్క్ పై దృష్టి సారిస్తోంది. దీనితో వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీ అందించగలదు.