Malaika Arora : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు ఏం చేసినా సంచలనమే. ఒకప్పుడు బాలీవుడ్ ను ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. భర్తతో విడిపోయిన తర్వాత చాలా కాలం పాటు అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. కానీ ఈ నడుమ అతనితో కూడా బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ క్రమంలోనే మలైకా అరోరా తాజాగా క్రికెట్ స్టేడియంలో మాజీ క్రికెటర్ సంగక్కరతో కలిసి కనిపించింది.
Read Also : Sardar 2: బ్లాక్ డాగర్ ఈజ్ కమింగ్.. ‘సర్దార్ 2’ ప్రోలాగ్ వీడియో అదుర్స్!
ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ కు మధ్య జరిగిన మ్యాచ్ కోసం ఆమె స్టేడియంకు వచ్చింది. రాజస్థాన్ టీషర్టు వేసుకుని మరీ సంగక్కర పక్కనే కూర్చుంది. ఇద్దరూ కలిసి మ్యాచ్ చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వారంతా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. రీసెంట్ గా మలైకా ఓ పోస్టు చేసింది. అందులో బీచ్ లో ఓ వ్యక్తితో ఎంజాయ్ చేస్తోంది. ఆ సీక్రెట్ వ్యక్తి కొంపదీసి సంగక్కర కాదు కదా అని తాజాగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై వీరిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తేగానీ రూమర్లు ఆగేలా కనిపించట్లేదు.