తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి కామెడీ జోనర్‌లో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా తాజాగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందింది. మార్చి 28, 2025న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించి లాభాల బాట పట్టినట్లు సమాచారం. ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్త మొత్తం 21 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్: 22 కోట్లు.
Malaika Arora : స్టేడియంలో క్రికెటర్ తో మలైకా అరోరా.. డేటింగ్ లో ఉన్నారా..?
ఈ లెక్కల ప్రకారం, సినిమా బ్రేక్ ఈవెన్ చేయాలంటే 22 కోట్ల షేర్ రావాల్సి ఉంది. అయితే, ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 55 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా దాదాపు 25 నుంచి 30 కోట్ల షేర్ వచ్చి ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’, తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది. తొలి రోజు 7.75 కోట్ల రూపాయల వసూళ్లతో శుభారంభం లభించిన ఈ చిత్రం, వీకెండ్‌లో మరింత ఊపు మీదుంది. 55 కోట్ల గ్రాస్‌తో మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటడం ద్వారా, ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టినట్లు స్పష్టమవుతోంది.