MI vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో ముంబై వాంఖడే స్టేడియంలో నేడు రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్ (MI), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరుగనుంది. ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో ముంబై కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో పరాజయం పాలైంది. మరోవైపు మొదటి మ్యాచ్ లో ఓడిపోగా, గత మ్యాచ్ లో విజయం సాధించింది. ఇప్పుడు అదే జోరుతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
Read Also: Devendra Fadnavis: 2029 తర్వాత కూడా మోడీనే ప్రధాని.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు కౌంటర్..
ముంబై ఇండియన్స్ (MI), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన హెడ్ టు హెడ్ రికార్డు గురించి మనం చూస్తే.. రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 34 IPL మ్యాచ్‌లు ఆడాయి. 34 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ (MI) 23 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కేవలం 11 సార్లు విజయం సాధించింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో నిరంతరం మార్పులు జరుగుతుండటంతో, ముంబై ఇండియన్స్ సరైన కాంబినేషన్ కోసం ఎదురు చూస్తోంది. కానీ, ప్రస్తుత జట్టులో స్పెషలిస్ట్ ఫినిషర్ లేకపోవడం పెద్ద మైనస్ గా కనపడుతోంది. టీంలో టి20 స్పెషలిస్ట్ ప్లేయర్స్ ఉన్న విజయం సాధించడానికి మాత్రం తెగ ప్రయత్నం చేస్తోంది. బ్యాటింగ్‌లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ముంబైకి అతిపెద్ద ఆశలు. కానీ, వారు పరుగులు తీయడానికి మాత్రం తెగ ఇబ్బంది పడుతున్నారు.
ఇక మరోవైపు అజింక్య రహానే నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బలమైన లైనప్‌ను కలిగి ఉంది. కానీ, క్వింటన్ డి కాక్ ఓపెనింగ్ భాగస్వామిగా సునీల్ నరైన్ లేకపోవడంతో మోయిన్ అలీ ఓపెనర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో రహానే, వెంకటేష్ అయ్యర్, అంగ్‌క్రిష్ రఘువంశీ ఉన్నారు. రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ సమక్షంలో డెత్ ఓవర్లలో దూకుడుగా బ్యాటింగ్ చేయడానికి KKR ఆటగాళ్లను కలిగి ఉంది. అదే సమయంలో జట్టు బౌలింగ్ కూడా బాగానే కనపడుతోంది. చూడాలిమరి నేడు ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుందా లేక తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తుందో.