CM Revanth Reddy : తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో జరిగిన కీలక సమావేశం ముగిసింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ (GHMC) విస్తరణ వంటి ప్రధానాంశాలపై లోతైన చర్చ జరిగింది. రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 29వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభం అనంతరం కొద్దిపాటి విరామం ఇచ్చి, తిరిగి జనవరి 2వ తేదీ…
Sarpach Sworn: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్‌ల ప్రమాణస్వీకార వేడుకల తేదీని ప్రభుత్వం మార్పు చేసింది. మునుపటి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీన జరగాల్సిన ఈ కార్యక్రమం, ఇప్పుడు డిసెంబర్ 22వ తేదీకి వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవడానికి, ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా తేదీని పొడిగించాలని…
Local Body Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. గడువు ముగిసే సమయానికి క్యూలైన్‌లో ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ మూడో దశలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలకు, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే.. మధ్యాహ్నం 1 గంటల వరకు…
Local body Elections : రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ విడత పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17న (బుధవారం) 182 మండలాలు, 4157 గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరగనుంది. తుది విడతలో 53 లక్షల 6 వేల 401 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 26 లక్షల 1861 మంది పురుష ఓటర్లు, 27 లక్షల 4…
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఆదివారం నాడు జరిగిన మలి విడత ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.
Local Body Elections : తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ విడతలో మొత్తం 85.76% పోలింగ్ నమోదైంది. జిల్లా వారీగా చూస్తే, యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92% పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76% నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల…
Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగియడంతో, అధికారులు పోలింగ్‌కు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 4,332 గ్రామ పంచాయతీలు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు 14వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు దాదాపు 28,278 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ఉదయం…
MLA Anirudh Reddy : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన సొంత గ్రామంలో కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అభ్యర్థి ఓటమికి బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కై, తమ వెనుక కొన్ని శక్తులను ఉంచి నడిపించాయని ఆయన ఆరోపించారు. ఓటమిపై సమీక్ష నిర్వహించి, రెండో విడత స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు పార్టీ సింబల్స్ కాకుండా వ్యక్తిని చూసి ఓటు…
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అద్భుతమైన పాలన అందిస్తున్నారని ప్రధాని అభినందించారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్న తీరు శుభపరిణామమని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో బీజేపీ…