సంగారెడ్డిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల గురించి గొప్పగా చెప్పే సీఎం కేసీఆర్ బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. కేవలం 20 శాతం టికెట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారని, రెండో సారి సీఎం అయ్యాక కేసీఆర్ కళ్ళు నెత్తికెక్కాయి కావచ్చు అంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. సారు కారు పదహారు అంటే సింగిల్ డిజిట్ కె మిమ్మల్ని తెలంగాణ ప్రజలు పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు పెద్దిరెడ్డి వార్నింగ్.. పరువు నష్టం దావా వేస్తాం..
మీ కేబినెట్ లో ఎంత మందికి బీసీలకు టికెట్లు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మోడీ క్యాబినెట్ లో 78 మందిలో 65 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలను తీసుకున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బీసీలను సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ముందా..? అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో బీసీలకు న్యాయం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క సారి బీజేపీకి తెలంగాణలో అవకాశం ఇవ్వండని ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు.
Also Read : Taneti Vanitha: చంద్రబాబును అయ్యో పాపం అనేవాడే లేడు.. బంద్ విఫలమే నిదర్శనం..