భారత్ జాగృతి అధ్యక్షురాలు, రాష్ట్ర శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత రేపు ఢిల్లీలో మహిళా బిల్లు పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లే మెరిడియన్ హోటల్ లో ఈ సమావేశం ప్రారంభం కానుండగా… ఈ మీటింగ్‌కు ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌర సమాజం, మహిళా సంఘాల ప్రతినిధులు రానున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసి మహిళా బిల్లుపై గళం వినిపించిన ఎమ్మెల్సీ కవిత దానికి కొనసాగింపుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
Also Read : Man Kills Wife: డ్రెస్సు సరిగా వేసుకోలేదని భార్యను చంపిన భర్త
ఇదిలా ఉంటే.. ఈనెల 16న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను మరో మారు ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఒకరోజు ముందు మహిళా బిల్లు పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటిసారి విచారణకు ముందు కూడా జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన కవితి.. మళ్లీ ఇప్పుడు ఒకరోజు ముందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం దేనికి సంకేతం అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే.. ఇప్పటికే మార్చి 11న తన వాంగ్మూలాన్ని ఈడీ ముందు ఇచ్చింది. ఈడీ కవితను తొమ్మిది గంటలపాటు ప్రశ్నించింది.
Also Read : Today Stock Market Roundup 14-03-23: ఇండియన్ మార్కెట్‌ని వీడని ‘సిలికాన్’ భయాలు