Today Stock Market Roundup: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభ భయాలు ఇండియన్ స్టాక్ మార్కెట్‌ని ఇంకా వీడలేదు. దీంతో ఇవాళ మంగళవారం కూడా నిన్నటి మాదిరి పరిణామాలే చోటుచేసుకున్నాయి. రెండు కీలక సూచీలు ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఇంట్రాడేలో ఆ పరిస్థితి కొనసాగలేదు. ఐటీ, ఆటోమొబైల్, పవర్, రియాల్టీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
దీంతో ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా నష్టాల బాటలోనే నడిచాయి. ఫలితంగా.. బెంచ్ మార్క్ వ్యాల్యూస్‌కి దిగువనే ముగిశాయి. సెన్సెక్స్.. 337 పాయింట్లు కోల్పోయి 57 వేల 900 వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ 110 పాయింట్లు తగ్గి 17 వేల 43 పాయింట్ల వద్ద ముగిసింది.
read more: Driver Salary: నెలకి రూ.2 లక్షలు. ఎవరి డ్రైవర్‌కి? ఎప్పుడు? ఏంటా కథ?
సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 7 కంపెనీలు మాత్రమే రాణించాయి. మిగతా 23 సంస్థలు వెనకబడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో టైటాన్, ఎయిర్‌టెల్, లార్సన్ అండ్ టూబ్రో లాభపడగా మహింద్రా అండ్ మహింద్రా ఘోరంగా.. అంటే.. దాదాపు 3 శాతం డౌన్ అయింది.
రంగాల వారీగా చూసుకుంటే.. నిఫ్టీలో ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్.. మోస్తారు లాభాలతో క్లోజ్ అయింది. ఇతర సెక్టార్లన్నీ నేలచూపులు చూశాయి. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. సోనా కామ్‌స్టార్ షేర్ల విలువ 8 శాతానికి పైగా పెరిగింది. 100కు పైగా పాథాలజీ సెంటర్లను అందుబాటులోకి తేవటం ఈ సంస్థకు కలిసొచ్చింది.
లుపిన్ సంస్థ స్టాక్స్ కూడా ఒక శాతానికి పైగా లాభాలు పొందాయి. 10 గ్రాముల బంగారం ధర 202 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 57 వేల 440 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 640 రూపాయలు పడిపోయింది. అత్యధికంగా 66 వేల 12 రూపాయలు పలికింది.
క్రూడాయిల్ ధర 125 రూపాయలు నష్టపోయింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 42 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 33 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 51 పైసల వద్ద స్థిరపడింది.