Vijay Varma: ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఏ విషయం దాపరికం లేకుండా ఓపెన్ సీక్రెట్ గా మారిపోతుంది. ఇదివరకు రాజకీయ ప్రముఖులు గాని.. సినీ తారలు గాని.. ఏవైనా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆచితూచి వ్యవహరించేవారు. కాకపోతే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెన్సేషన్ క్రియేట్ చేయాలనో., లేకపోతే.. మరేదో విషయంపై వార్తల్లో నిలవాలన్న ఉద్దేశంతోనే అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ సైతం మాట్లాడిన మాటలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం సంబంధించి వివరాలు చూస్తే..
Darling: బాగ్స్ ప్యాక్ చేసుకుని పదండి అంటున్న హీరోయిన్
ప్రస్తుతం హీరోయిన్ గా తమన్నాకు అన్ని భాషలలో ఆఫర్స్ తగ్గడంతో ఆవిడ రూటు మార్చి వెబ్ సిరీస్ లతో బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు సినిమాల్లో కనపడుతూ ఉన్న ఈ భామ తాజాగా ఆమె బాయ్ ఫ్రెండ్ సంబంధించిన విషయాలతో మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. హీరోయిన్ తమన్నా విజయ్ వర్మతో సాగిస్తున్న ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన లవ్ స్టోరీస్ 2 షూటింగ్ టైం లోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు సమాచారం. అయితే వీరిద్దరు అతి త్వరలో పెళ్లికి రెడీ కానున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు చాలాసార్లు తమన్న తన ప్రియుడు గురించి మాట్లాడుతూ.. ఆయనంటే తనకు చాలా ఇష్టం అని., నాకు ఏం కావాలో అతనికి బాగా తెలుసని.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు అండగా ఉంటాడన్న నమ్మకం తనకు ఉన్నట్టు మాట్లాడింది. ఈ మధ్యకాలంలోనే వీరిద్దరూ ముద్దులు పెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Virat Kohli-Rohit Sharma: ఫొటో దిగుదామని రోహిత్‌ను నేనే కోరా: కోహ్లీ
ఇకపోతే ప్రస్తుతం విజయ్ వర్మ మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మనం మన పార్టనర్స్ నుంచి చాలా వరకు నేర్చుకుంటాం.. అందులో ముఖ్యంగా సెక్సువల్ గా ప్రతిదీ మనకి మనమే తెలుసుకోలేము. డిస్కవర్ చేయలేము., మనం సరైన ఎనర్జీ ఉన్న పార్ట్నర్ ను కలిసినప్పుడే మీరు అబ్బాయి నుంచి మగవాడిగా మారతారంటూ ఆయన బోల్డ్ స్టేట్మెంట్స్ చేశాడు. దీంతో నెటిజన్స్ తమన్న బాయ్ ఫ్రెండ్ విజయ వర్మను ఆట ఆడుకున్నారు. ఇది విన్న చాలా మంది నటిజెన్స్ మీ పార్ట్నర్ ఎవరు..? నీ లవర్ తమన్నానా..? ఆమె నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావ్..? అని సోషల్ మీడియాలో ర్యాగింగ్ చేసేస్తున్నారు.