Plastic Cover in Biryani: ఈ మధ్యకాలంలో హోటల్లు, రెస్టారెంట్లో, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన సమయంలో మనం తినాల్సిన ఆహార పదార్థాలతో పాటు తినకూడని వాటిని కూడా అందిస్తున్నారు సదరు రెస్టారెంట్ యజమానులు. ఇదివరకు ఐస్క్రీమ్ లలో మనిషి బొటన వేలు, అలాగే కర్రీలో కాళ్ల జెర్రీ., చాక్లెట్ క్రీమ్ లో చనిపోయిన ఎలుక ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులోకి మరో సంఘటన చేరింది. అది ఎక్కడో కాదండి మన హైదరాబాద్ మహానగరంలోనే. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Virat Kohli-Rohit Sharma: ఫొటో దిగుదామని రోహిత్‌ను నేనే కోరా: కోహ్లీ
హైదరాబాద్ మహానగరం పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది చార్ మినార్. ఆ తర్వాత బిర్యాని. అలాంటి బిర్యానీ ను ఈ మధ్యకాలంలో కొందరు రెస్టారెంట్ యజమానులు పురుగులు పట్టిన ఆహారపదార్థాలతో, అలాగే చెడిపోయిన కూరగాయలతో తయారు చేస్తూ ప్రజలకు అందిస్తున్నారు కొందరు. ఇకపోతే తాజాగా ఓ వ్యక్తి స్విగ్గి ద్వారా చికెన్ బిర్యానీని ఆర్డర్ చేయగా అందులో అతనికి ఏకంగా ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్ ను అందుకున్నాడు. హైదరాబాద్ మహా నగరంలోని మణికొండ ప్రాంతంలో ఉన్న మెహిఫిల్ రెస్టారెంట్ నుండి ఓ వ్యక్తి స్విగ్గి ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాడు. అలా ఆర్డర్ చేసుకున్న అనంతరం అతనికి బిర్యాని అందుకున్నాడు. అలా వచ్చిన బిర్యాని తిందామని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. దీని కారణం అతడు అందుకున్న బిర్యానిలో మసాలా ప్లాస్టిక్ కవర్ తో కూడిన బిర్యాని చూడడమే. దీంతో తనకు జరిగిన సంఘటనకు సంబంధించిన ఫోటోలను తాజాగా ఆ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త వైరల్ గా మారంది.
Gandhi Hospital: నా ఆరోగ్యం సరిగా లేదు.. దీక్ష విరమించిన మోతిలాల్ నాయక్..