జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో నిర్వహించిన పలు మోర్చాల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 సంవత్సరాల మోడీ పరిపాలన ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ నెల ఒకటి నుండి 30వ తేదీ వరకు మహా జన సంపర్క్ అభ్యాన్ పేరుతో ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ పథకాలను చేరవేయడమే బీజేపీ పార్టీ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఈ నెల 22 నుండి ఇంటింటికి బిజెపి కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. ‘ రాష్ట్రంలో రైతులు అకాల వర్షాలతో పంట నష్టపోతే ఎకరానికి పదివేల ఆర్థిక సాయం అందజేస్తానని సీఎం కేసీఆర్ తెలిపాడు కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతు అకౌంట్లో కూడా డబ్బులు వేయలేదు.
Also Read : Pawan Kalyan Varahi Yatra: వారాహి యాత్రకు పర్మిషన్ ఇస్తారా? లేదా ?
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నాడు కేసీఆర్. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్ల దృష్టిలో రైతులు డిపార్టలుగా మారిపోయారు. పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి ఇవ్వని సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు మాత్రం చల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశాడు. బీజేపీ పార్టీకి రాజకీయాలు ముఖ్యం కాదని అభివృద్ధి మా లక్ష్యం. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో పోలీసు అధికారులకు టిఏలు గాని ప్రమోషన్లు గానీ మెడికల్ అలవెన్స్ గాని అందించలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. బీజేపీ కార్యకర్తలను కొడితేనే కేసులు పెడితేను పోలీసులకు ప్రమోషన్లు ఇస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
Also Read : Prabhas Srinu: నటి తులసితో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ స్నేహితుడు