Pawan Kalyan Varahi Yatra: వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని చెబుతున్న జనసేనాని… ఈ నెల 14న ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్రతో ప్రచారం చేపట్టనున్నారు. వారాహి యాత్రకు ముందు..అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోరుతూ హోమం నిర్వహించారు. ధర్మ పరిరక్షణ, ప్రజాక్షేమం, సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ యాగం చేశారు. పార్టీ కార్యాలయంలోని ఆఫీసు ప్రాంగణంలో… భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.
Read Also: Mahesh fans : త్రివిక్రమ్ పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్..?
ఈ నెల 14 నుంచి పవన్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. పవన్ ఒక రోజు ముందుగా మంగళవారం మధ్యాహ్నానికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేరుకుంటారు. అయితే కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పోలీసులు సెక్షన్ 30 అమలు చేస్తుండడంతో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. సెక్షన్ 30 ఈ నెలాఖరు వరకు అమల్లో ఉండనుంది. సెక్షన్ 30 అమల్లో ఉన్నంతసేపు అనుమతులు లేనిదే సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు వీల్లేదంటున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే మినిట్ టు మినిట్ షెడ్యూల్‌తో వారాహి యాత్ర, సభలను సక్సెస్ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసిన జనసేన శ్రేణులు…పోలీసుల తీరు, ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. అటు పోలీసు అధికారుల వాదన మరోలో ఉంది. పవన్ వారాహి యాత్రపై జనసేన నేతలు తమకు ముందస్తు సమాచారం మాత్రమే ఇచ్చారంటున్నారు. భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలంటే మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇవ్వాల్సిందేనంటున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలని చెప్పారే కానీ ఎక్కడ చేస్తారో చెప్పలేదని, మైక్ పర్మిషన్‌కు సంబంధించి అనుమతులు అడగలేదనేది పోలీసు అధికారుల వాదనగా ఉంది.
Read Also: YSRCP vs BJP: ఏపీలో హీటెక్కిన రాజకీయం.. బీజేపీ వర్సెస్ వైసీపీ..!
అయితే వారాహి యాత్రపై మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఇచ్చేశామని, ఎక్కడికక్కడే డీఎస్పీలకు సమాచారం ఇచ్చామని చెబుతున్నారు జనసేన నేతలు. ఎన్ని ఆటంకాలు పెట్టినా వారాహి యాత్ర ఆగదని చెబుతున్నారు. జనసేన నేతల మాటెలా ఉన్నా.. వారాహి యాత్ర, సభలకు పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేది ఇప్పుడు పార్టీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. ఈ నెల 14న అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజలు చేశాక వారాహి యాత్ర మొదలవుతుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు కత్తిపూడిలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు..ఈ 8 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర జరుగుతోంది. ఆ తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో వారాహి యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రతో జనసేన శ్రేణుల్లో జోష్ తేవడంతో పాటు..మేనిఫెస్టోకు పవన్ కసరత్తు చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఆశావహుల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనేదానిపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.