Botsa Satyanarayana: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరిపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓ వైపు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. ‘న్యాయం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి యాత్ర ప్రారంభించగా.. మరోవైపు ఏపీ సర్కార్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు పురంధేశ్వరి.. అయితే, ఒకేసారి ఇద్దరిపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స.. చంద్రబాబు అరెస్ట్‌పై సాక్ష్యాధారాలు ఉన్నాయి అని న్యాయస్థానం చెప్పిందన్న బొత్స.. న్యాయస్థానం చెప్పింది కూడా తప్పు అనడం విడ్డూరం అన్నారు. న్యాయస్థానం మీద పోరాడం చేస్తున్నారా? న్యాయస్థానానికి తప్పు ఆపాదిస్తున్నారా? భువనేశ్వరి చెప్పాలని డిమాండ్ చేశారు..
Read Also: NCERT: ఇకపై పుస్తకాల్లో ‘ఇండియా’ బదులు ‘భారత్’..
ఇక, మద్యం అమ్మకాలపై బీజేపీ అధిష్టానికి, కేంద్ర ప్రభుత్వానికి పురంధేశ్వరి ఫిర్యాదు చేయడంపై స్పందించిన బొత్స.. మద్యం అమ్మకాలపై పురంధేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేశారు.. దానిపై ఎలాంటి దర్యాప్తు చేపట్టినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.. మరోవైపు.. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అన్ని చర్యలు చేపడుతున్నాం అన్నారు. అన్ని విధాలా సామాజిక న్యాయం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. గత ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరగలేదని విమర్శించారు. ఇక, టీడీపీ, జనసేన ప్రజల్లో లేదు, తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఏదో బలం ఉందని చూపించుకునేందుకు టీడీపీ, జనసేన పార్టీలు తాపత్రయ పడుతున్నాయి.. మేం ఏం తప్పు చేశామో, మమ్మల్ని ఎందుకు ఆదరించకూడదో చెప్పాలని సవాల్ చేశారు.. మొత్తంగా.. ఒకే సారి పురంధేశ్వరి, భువనేశ్వరికి కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.