ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా.. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడ్డామన్న సీఎం హామీలను ప్రజలు విశ్వసించారని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మగౌరవం కాపాడారన్న అభిమానం ముఖ్యమంత్రిపై మహిళలలో పెరగడం వల్ల నిన్న ఎద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందన్నారు.
సిద్ధం, బై బై పదాలు మావే.. కాపీ కొట్టి వాడుకుంటున్నారు అంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని మోడీతో కూటమి చెప్పిస్తే గాజువాక నుండి అమర్, విశాఖ ఎంపీ పోటీ నుండి బొత్స ఝాన్సీ తప్పుకుంటారని సవాల్ చేశారు. చంద్రబాబు మీటింగ్ లలో మాట్లాడే భాష చాలా ఘోరంగా వుంది.. మీ భాషని అదుపులో పెట్టుకోండి.. బజారు మాటలు మాట్లాడకండి..…
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ చీపురుపల్లి, విజయనగరంలో పర్యటనలో మాట్లాడే తీరు చూశానని.. పేపర్లు ఇటుతిప్పి అటుతిప్పి మాట్లాడారని ఎద్దేవా చేశారు. అసలు భౌగోళిక పరిస్థితులపై అసలు అవగాహన ఉందా అని విమర్శించారు. బాలకృష్ణ విద్యాశాఖపై మాట్లాడారు.. డిబెట్ కి రండి అని మంత్రి బొత్స సవాల్ విసిరారు. కళ్లులేని కబోదికి ఏం తెలుస్తుంది ఆ విధంగా ఉంది ప్రసంగమని అన్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్…
రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర, విశాఖ వనరులు, అవకాశాలను అప్పటి ప్రభుత్వం ధ్వంసం చేసిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఆలస్యం అయినా పరిపాలన విశాఖ నుంచే ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన ఇన్వెస్టర్లను ఆకర్షించిందని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
రేపు గాజువాక పర్యటనకు వస్తున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైఖరి ఏంటో చెప్పాలనీ జనం నిలదీయాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలు అడిగినా, అడగకపోయినా టీడీపీ సమాధానం చెప్పాలి అని పేర్కొన్నారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ది చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నాడు.. చంద్రబాబు అన్ని రంగాలని మేనేజ్ చేసేవాడు. అందుకే ఆయన హయాంలో అన్ని రంగాలు వెనకపడ్డాయి అని విమర్శించారు.