Rakshabandhan: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నందమూరి బాలకృష్ణకు తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి రాఖీ కట్టింది. ఆ తర్వాత ఇరువురు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ తన సోదరి పురందేశ్వరి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను దగ్గుబాటి పురందేశ్వరి సోషల్ మీడియా వేడుకగా పంచుకున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. దగ్గుబాటి పురందేశ్వరి వీడియోని షేర్ చేస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన సందేశాన్ని తెలిపింది.…
రాజకీయాల్లో స్వలాభాపేక్ష ఏ రోజూ తాను చూసుకోలేదని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. పార్టీకి లాభం చేకూర్చాలనే భావన తప్ప.. తన రెండు సంవత్సరాల ప్రస్ధానంలో మరే ఆలోచన లేదన్నారు. తనను ప్రోత్సహించిన, ప్రతిఘటించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పీవీఎన్ మాధవ్ కూడా కార్యకర్తలకు అనుగుణంగా వెళతారని తాను ఆశిస్తున్నానని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికయ్యారు. బీజేపీ జెండాను మాధవ్‌కు ఇచ్చి.. పార్టీ బాధ్యతలను పురంధేశ్వరి అప్పగించారు. మాధవ్…
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కొడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ బీజేపీ కండువా కప్పుకున్నారు. పరిగెలకు పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి, సాధరంగా ఆహ్వానించారు. గన్నవరం సర్పంచ్ కూడా పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో పలు జిల్లాల కాంగ్రెస్,…
తమ ప్రభుత్వంలో కక్ష సాదింపు చర్యలు ఉండవు ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ విచారణ సాగుతుందని దానిలో ప్రభుత్వ ప్రమేయం ఏమి ఉండదని, విచారణ అనంతరం నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటున్నారు. మొన్న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వెళుతుండగా అంత హంగామాచేయడం అవసరమా.. తాజాగా కూడా కేటీఆర్ విచారణ ను ఏదో జరగబోతున్నట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా హంగామా చేస్తున్నట్లుగా దృష్టికి వచ్చిందని పొంగులేటి అంటున్నారు. విచారణ ల…
దేశంలో పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యం అని బీజేపీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. భారతదేశంలో 80 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నామన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో పేదరికం ఐదు శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో.. దానికి జవాబుదారీతనంగా పరిపాలన ఉందన్నారు. 11 సంవత్సరాల వికసిత భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి పెద్దపీట అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.…
Daggubati Purandeswari: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మంగళవారం విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం ప్రజలందరినీ మొక్కలు నాటేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వివిధ అంశాలపై మాట్లాడారు. Read Also: Google Maps: గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్.. ఓరి దేవుడా…
అదే నా ఆశ.. ఆకాంక్ష! నూతన మార్గదర్శకాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలన్నదే తన ఆశ, ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మహానాడు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా…
పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఏ మతం వారో అడిగి మరీ చంపడంతో సహనం పూర్తిగా పోయిందని, అందువల్లే పాకిస్తాన్‌కు భారత్ తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. భారతదేశం 1947 నుండి సరిహద్దు ఉగ్రవాదంతో బాధపడిందన్నారు. భారతదేశాన్ని మరింతగా బాధపెట్టకుండా పాకిస్తాన్ వెనక్కి తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది అని పురంధేశ్వరి చెప్పారు.…
జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం అని, బీజేపీ మతతత్వ పార్టీ కాదని జకియా ఖానం చేరిక ద్వారా చెపొచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కులమతాలకు తావులేకుండా భారతీయులుగా ముందుకెళ్లాలన్నది బీజేపీ నినాదం.. మూల సిద్ధాంతం అని చెప్పారు. దేశంలో బీజేపీ అద్భుతమైన పాలనను అందిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో దృఢమైన నిర్ణయం ప్రధాని మోడీ తీసుకున్నారని పురంధేశ్వరి ప్రశంసించారు. ఈరోజు ఉదయం వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పిన జకియా ఖానం..…