పిల్లల పెంపకంలో తల్లుల పాత్ర అత్యంత కీలకం అని నారా భువనేశ్వరి అన్నారు. చిన్నతనంలోనే విలువలు, సంస్కారం పిల్లలకు నేర్పాలని చెప్పారు. పిల్లల ఆసక్తిని గుర్తించి.. ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. తన కుమారుడు, మంత్రి నారా లోకేష్ ప్రజాసేవలో బిజీగా ఉండటంతో.. దేవాన్ష్ చదువు, క్రీడలను బ్రాహ్మణి చూసుకుంటోందన్నారు. గతంలో రాజకీయాల్లో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు కారణంగా లోకేష్ పెంపకం బాధ్యత తాను తీసుకున్నాను అని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. కుప్పం సామగుట్లపల్లి మండల పరిషత్…
Chandrababu Couple: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా లండన్‌లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు వారికి ఘన స్వాగతం పలికాయి. ముఖ్యమంత్రి దంపతులు ఆప్యాయంగా తెలుగు వలసదారులతో మాట్లాడారు. ఈ పర్యటనలో వ్యక్తిగత అంశాలతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంకు కూడా హాజరుకానున్నారు. నవంబర్ 4న లండన్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి రెండు అంతర్జాతీయ…
CM Chandrababu Couple London Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు.. రేపు రాత్రి లండన్ పర్యటనకు వెళ్లనున్నారు నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి.. తన సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు.. వ్యక్తిగత పర్యటన తర్వాత పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు.. రేపు రాత్రి సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ వెళ్లనున్న చంద్రబాబు.. అయితే, ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్…
ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం నారా చంద్రబాబు నాయుడు దీపావళి వేడుకలు చేసుకున్నారు. పండగ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇంట్లో పూజ చేసి దీపాలు వెలిగించారు. ఆపై సతీమణితో కలిసి కాకరవత్తులు వెలిగించారు. చెడుపై మంచి సాధించిన విజయం దీపావళి అని సీఎం అన్నారు. చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం దీపావళి వేడుకలకు సంబంధించిన పిక్స్ వైరల్ అయ్యాయి.
తలసేమియా వ్యాధిపై అవగాహన పెంచడంతో పాటు వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. రన్‌లో ఒలింపిక్స్ పతక విజేత కరణం మల్లీశ్వరి పాల్గొననున్నారు. రన్ తర్వాత తమన్, సమీరా భరద్వాజ్ నేతృత్వంలో మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. Also Read: CM Chandrababu: టీడీపీ…
నన్ను మేడం అని పిలవవద్దు.. నేను మీ భువనమ్మను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి.. తాను దత్తత తీసుకున్న కృష్ణా జిల్లా కొమరువోలు గ్రామంలో ఈ రోజు పర్యటించిన ఆమె.. గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నన్ను మేడం అని పిలవవద్దు.. నేను మీ భువనమ్మను అని వ్యాఖ్యానించారు..
Nandamuri Thaman: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.
నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే.. యాక్షన్.. డైలాగ్స్.. ఏ సినిమాలోనైనా.. బాలయ్య మార్క్ డైలాడ్స్ ఉండాల్సిందే.. ఇప్పుడు బాలయ్య డైలాగ్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, బాలయ్య సోదరి నారా భువనేశ్వరి నోటా వచ్చింది.. కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతుండగా.. అందులో భాగంగా ఈ రోజు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.. ఈ సందర్భంగా బాలయ్య సినిమా డైలాగ్ చెప్పారు భువనేశ్వరి
Nara Bhuvaneswari: నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం హీరో టాలీవుడ్‌కి రాబోతున్న సంగతి విధితమే. నందమూరి జానకిరామ్ కొడుకు, నందమూరి హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. వైవీఎస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. అతి త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాడు. దర్శకుడు వైవిఎస్ చౌదరి ఫస్ట్ లుక్ రివీల్ దీపావళి సందర్భంగా అందించారు. ఇకపోతే, ఎన్టీఆర్ మంచి సైజు, రంగు, మంచి వాయిస్ కూడా…
విజయవాడ పున్నమి ఘాట్లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పలువురు మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఆమెతో పాటు.. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, మంత్రులు అనిత, సవిత, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.