NCERT: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా దేశ పేరును ఇండియా స్థానంలో భారత్ అని మారుస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం ఎలా ఉన్నా.. ప్రస్తతం NCERT కొత్తగా పాఠశాల పుస్తకాల్లో ఇండియాకు బదులుగా భారత్ అని మర్చారు. కొత్తగా వచ్చే పుస్తకాలన్నింటిలో ఇండియా స్థానంలో భారత్ అని ఉంటుంది. ఈ ప్రతిపాదనను కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిందని ప్యానెల్ సభ్యుల్లో ఒకరైన సీఏ ఇసాక్ తెలిపారు. ఈ పేరు మార్పు ప్రతిపాదన కొన్ని నెలల క్రితమే పెట్టామని, ఇప్పుడు ఆమోదించామని ఆయన అన్నారు.
Read Also: Bhagavanth Kesari: మొత్తానికి బాలయ్య సెంచరీ కొట్టాడు..
భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 1(1) మనదేశం పేరును ఇండియా, అంటే భారత రాష్ట్రాల యూనియన్ అని ఉంటుంది. ఇదిలా ఉంటే గత నెలలో జీ 20 సమావేశాలకు సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశం పేరును ఇండియా స్థానంలో భారత్ అని మారుస్తుందనే రూమర్స్ వచ్చాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ20 దేశాధి నేతలకు ఇచ్చిన విందు ఆహ్వాన పత్రికలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ స్థానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొన్నారు. ఆ తరువాత జరిగిన జీ20 సమావేశంలో కూడా ప్రధాని మోడీ ముందు ఇండియాకు బదులుగా ‘భారత్’ అనే నేమ్ ప్లేట్ ఉంది.
ఇదిలా ఉంటే NCERT కమిటీ గతంలో ‘హిందూ విజయాల’ను హైలెట్ చేయాలని ప్రతిపాదించింది. ప్రాచీన చరిత్ర బదులుగా క్లాసికల్ హిస్టరీని ప్రవేశపెట్టాని కూడా సిఫారసు చేసింది. శాస్త్రీయ పురోగతి, జ్ఞానం గురించి తెలియకుండా భారతదేశాన్ని అంధకారంలో చూపించిన బ్రిటిష్ వారి చరిత్రను ఇకపై ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునికంగా విభజించరని ఇస్సాక్ అన్నారు. అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాల్లో భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకెఎస్)ని ప్రవేశపెట్టాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది.