India Pakistan: గత కొంత కాలంలో పాకిస్తాన్‌లో పలువురు ఉగ్రవాదులు ‘‘గుర్తుతెలియని వ్యక్తుల’’ చేతిలో మరణించారు. బైక్‌పై వచ్చేవారు ఉగ్రవాదుల్ని దగ్గర నుంచి కాల్చి చంపారు. ఇదే తరహాలో పాకిస్తాన్ వ్యాప్తంగా పలువురు ఉగ్రవాదుల హత్యలు జరిగాయి. అయితే, ఈ చనిపోయిన ఉగ్రవాదులకు భారత్‌లో ఏదో విధంగా సంబంధం ఉండటం గమనార్హం. వీరు భారత్‌లో గతంలో ఉగ్రవాదానికి పాల్పడినవారే. అయితే, ఈ హత్యలన్నీ కూడా భారత మనుషులే చేస్తున్నారంటూ పాక్ అధికారులు పలుమార్లు ఆరోపించారు. అయితే, నేరుగా భారత్ పేరు తీసుకోకుండా పొరుగున ఉన్న దేశమని లేదా శత్రుదేశమని కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే, తాజాగా వాషింగ్టన్ పోస్ట్ కథనం సంచలనంగా మారింది. 2021 నుంచి పాకిస్తాన్‌లో ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చేందుకు భారత గూఢచార సంస్థ పద్ధతి ప్రకారం ఈ హత్యల్నిఅమలు చేసిందని మంగళవారం వాషింగ్టన్ పోస్ట్ కథనం నివేదించింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) ప్లాన్ చేసి ఆరు హత్యలు చేసిందని ఆరోపించింది. అమెరికా, కెనడాల్లో ఖలిస్తాన్ వేర్పాటువాదులను హతమార్చే ప్లాన్‌లకు పాకిస్తాన్ ప్లాన్‌కి సారుప్యతలు ఉన్నాయని చెప్పింది.
Read Also: Kia Ciros Bookings: అర్ధరాత్రి నుంచే కియా సిరోస్ ఎస్‌యూవీ బుకింగ్స్.. ధర, ఫీచర్స్ ఇవే..
పాకిస్తాన్‌లో హత్యలు చేసింది భారత పౌరులు కాదని, పాకిస్తాన్‌లోని చిన్న నేరస్తులు లేదా ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన కిరాయి షూటర్లు అని వార్తా పత్రిక పేర్కొంది. రా దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్తలను మధ్యవర్తులుగా నియమించుకుందని, నిఘా నిర్వమించడానికి, హత్యలు చేయడానికి హవాలా లేదా అనధికార లావాదేవీలను, ఫైనాన్షియల్ నెట్వర్క్ ద్వారా చెల్లింపులు చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించుకుందని తెలిపింది.
2022లో జహూర్ మిస్త్రీ అనే ఉగ్రవాది పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. ఇతడికి 1999 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్‌తో సంబంధం ఉంది. ఆ సమయంలో విమానంలోని ఒక ప్రయాణికుడిని మిస్త్రీ హత్య చేశాడు. దీనిపై తన గుర్తింపుని వెల్లడించని పాకిస్తాన్ అధికారి వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. ఒక మహిళ తనను తాను తానాజ్ అన్సారీ అని పరిచయం చేసుకుందని, నిజానికి మిస్త్రీని చంపే ఆపరేషన్‌లో భారతీయ ఇంటెలిజెన్స్ అధికారి పాల్గొందని చెప్పాడు.
మిస్త్రీని ట్రాక్ చేయడానికి ఇద్దరు పాకిస్తానీయులను, అతడిని కాల్చడానికి ఇద్దరు ఆఫ్ఘన్ పౌరులను, ఆగ్నేయాసి, ఆఫ్రికా, పశ్చిమాసియాకు చెందిన వారికి ఈ హత్యలో సంబంధం ఉందని, వీరిని తానాజ్ అన్సారీ నియమించుకుందని, ఒక్కొక్కరికి 5500 డాలర్లు (దాదాపుగా రూ. 4.7 లక్షలు) ఇచ్చిందని సదరు పాక్ అధికారి వాషింగ్టన్ పోస్టకు వెల్లడించారు. 1990వ దశకంలో కాశ్మీర్‌లో చురుకుగా పనిచేసిన ఉగ్రవాది సయ్యద్ ఖలీద్ రజాని చంపడంలో కూడా భారత ఏజెంట్ అయిన మహిళ ప్రమేయం ఉందని, ఈ విషయాలను పాక్ అధికారులు చెప్పిటన్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.