దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు కియా ద్వారా అనేక అద్భుతమైన వాహనాలు భారత మార్కెట్లో విక్రయించబడుతున్న సంగతి తెలిసిందే.. కాగా.. ఇటీవల ఇండియాలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూనే కంపెనీ మరో కొత్త వాహనాన్ని విడుదల చేసింది. అదే కియా సిరోస్ ఎస్‌యూవీ.. కియా మోటార్స్ జనవరి 3 నుంచి తన పోర్ట్‌ఫోలియోలో సరికొత్త సిరోస్ ఎస్‌యూవీ బుకింగ్‌ను ప్రారంభించనుంది. అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి దీని బుకింగ్ ప్రారంభం కానుంది.
READ MORE: Rajanna Sircilla: క్లాస్ మెట్కు న్యూ ఇయర్ విషెస్.. సాయంత్రం అబ్బాయి సూసైడ్
కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ డీలర్‌షిప్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీ కూడా ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోలిస్తే దీని డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉంది. భారతీయ మార్కెట్లో కంపెనీకి ఇది 7వ మోడల్. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే సోనెట్, సెల్టోస్, నిస్సాన్, కార్నివాల్, ఈవీ6, ఈవీ9 ఉన్నాయి. దాని బేస్ టర్బో ట్రిమ్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.50 లక్షలు ఉండొచ్చు. టాప్ వేరియంట్ ధర రూ. 15 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
READ MORE:Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఈవీ టీజర్ విడుదల.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473కి.మీ రేంజ్..
ఇదిలా ఉండగా.. సరికొత్త డిజైన్, ఆకర్షణీయమైన లుక్‌తో కియా సైరాస్‌ను తీసుకొచ్చింది. తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈవీ9 తరహా డిజైన్‌తో దీన్ని రూపొందించడం గమనార్హం. వర్టికల్ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్స్ ఉన్నాయి. అలాయ్ వీల్స్‌తో దీన్ని తీసుకొచ్చారు. HTX+(O), HTX+, HTX, HTK+, HTK (O), HTK.. ఇలా ఆరు వేరియంట్లలో ఇది లభిస్తుంది. భద్రత కోసం ఇందులో 360డిగ్రీ కెమెరా, సిక్స్ ఎయిర్ బ్యాగులు, హిల్ స్టార్ట్ అసిస్టెంట్, లెవల్- 2 ADAS ఫీచర్లు జోడించారు.
READ MORE: Maruti Suzuki Sales: 2024లో అత్యధికంగా అమ్ముడైన మారుతీ సుజుకి కారు ఇదే..
కియా సైరాస్ ఎస్‌యూవీ 465 లీటర్ల బూట్‌స్పేస్‌ని కలిగి ఉంటుంది. 1.0 లీటర్ల టర్బో ప్రెటోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 118 bhp శక్తిని, 172 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ అయితే.. 113 hp పవర్, 250Nm పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలో 6 స్పీడ్ MT, 7- స్పీడ్ DCT, 6 – స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఇంటెన్స్ రెడ్, ఫ్రాస్ట్ బ్లూ, ప్యూటర్ ఆలివ్, ఆరా బ్లాక్ పెరల్, గ్రావిటీ గ్రే, ఇంపీరియల్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెరల్, స్పార్కింగ్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.