Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారతదేశంతో యుద్ధానికి ఆరాపడుతున్నాడని, అయితే ఇమ్రాన్ ఖాన్ భారతదేశంతో, బీజేపీతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడని ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ అన్నారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ‘‘ఇస్లామిక్ కన్జర్వేటివ్’’గా ఆరోపిస్తూ, ఇమ్రాన్ ఖాన్‌ను ‘‘స్వచ్ఛమైన లిబరల్’’గా ఆమె అభివర్ణించారు.
Harbhajan Singh: అబుదాబి టీ10 లీగ్‌లో ఆడుతున్న టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్పిన్ స్టాలియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. బుధవారం నాడు నార్తర్న్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్పిన్ స్టాలియన్స్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
Khawaja Asif: పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ మరోసారి భయంతో వణుకుతోంది. భారత్ మళ్ళీ పాకిస్థాన్ పై దాడి చేసే అవకాశం ఉందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా పేర్కొ్న్నారు. భారత ఆర్మీ చీఫ్ ప్రకటనను తోసిపుచ్చలేమని ఖవాజా ఆసిఫ్ అన్నారు. భారత్ మరోసారి సరిహద్దు దాటి దాడి చేయవచ్చని జోష్యం చెప్పారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ...
Pakistan: భారతదేశంలో ఎప్పుడు ఉగ్రవాద దాడి జరిగిన, దాని మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయి. అయితే, ఈ నిజాన్ని ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఒప్పుకోదు. తమ ప్రమేయం లేదని చెబుతుంటుంది. ఈసారి కూడా అదే ప్రయత్నం చేసింది. ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్‌ను తక్కువ చేసేలా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ ఉగ్రదాడి గురించి స్పందిస్తూ.. ‘‘గ్యాస్ సిలిండర్ పేలుడు’’గా ఆసిఫ్ అభివర్ణించారు. భారత్ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని వాడుకుంటోందని ఆరోపించారు.
Pakistan: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కోర్టు వెలుపల ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించారు. అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న వానాలోని క్యాడెట్ కాలేజీపై సోమవారం దాడి జరిగింది. ఈ రెండు దాడుల్లో భారత్ పాత్ర ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఈ రెండు దాడులు ‘‘భారత స్పాన్సర్ ఉగ్రవాద ప్రాక్సీ దాడులు’’ అని నిందించారు. పాకిస్తాన్‌ను అస్థిరపరిచేందుకు భారత్ ఉగ్రవాదాన్ని నిర్వహిస్తుందని ఫరీఫ్ మంగళవారం అన్నారు. భారతదేశ…
Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భవించి వందేళ్లు పూర్తైన సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు నష్టం కలిగించేలా భారత్ ప్రతి సారి ఓడిస్తునే ఉండాలని, అప్పుడు వారు శాశ్వతంగా పశ్చాత్తాపం చెందక తప్పదన్నారు.
Pakistan: సిక్కు మత స్థాపకుడు గురునానక్ 556వ జయంతి సందర్భంగా భారత్‌లోని సిక్కు మతస్తులు ఆయన జన్మస్థలం అయిన పాకిస్తాన్ లోని నంకనా సాహిబ్‌కు వెళ్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్‌కు భారతీయులు వెళ్లడం ఇదే తొలిసారి. అయితే, ఇలా వెళ్లే వారిలో 14 మందిని పాకిస్తాన్ అధికారులు ముందుగా వారి దేశంలోకి అనుమతించి, ఆ తర్వాత తిప్పి పంపించారు. ‘‘మీరు సిక్కులు కాదు, హిందువులు’’ అంటూ పాక్ అధికారులు వారి దేశంలోకి అనుమతించలేదు.
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. భారతదేశం పాకిస్తాన్‌పై ద్విముఖ పోరు చేస్తుందని ఆరోపించారు. రెండు సరిహద్దుల్లో యుద్ధం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్ ప్రాక్సీగా ఉపయోగించుకుంటుందని ఆయన అన్నారు.
India-Pakistan: అమెరికా నిఘా ఏజెన్సీ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) మాజీ అధికారి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తప్పకుండా ప్రకంపనలు సృష్టిస్తాయి. 2001 పార్లమెంట్ దాడుల తర్వాత భారత్-పాకిస్తాన్‌లు యుద్ధానికి దిగుతాయని సీఐఏ విశ్వసించిందని జాన్ కిరియాకౌ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, భారత్‌ను దాడులు ఆపేయాలని కోరకుంటే, అది వారికి ఘోరమైన విపత్తుగా మారేదని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మంగళవారం అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత, మే నెలలో భారత్ పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలతో పాటు ఆ దేశ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. నాలుగు రోజుల ఈ సైనిక ఘర్షణ తర్వాత, పాకిస్తాన్ బ్రతిమిలాడటంతో భారత్ సైనిక చర్యను నిలిపేసింది.