India Pakistan: గత కొంత కాలంలో పాకిస్తాన్‌లో పలువురు ఉగ్రవాదులు ‘‘గుర్తుతెలియన వ్యక్తుల’’ చేతిలో మరణించారు. బైక్‌పై వచ్చేవారు ఉగ్రవాదుల్ని దగ్గర నుంచి కాల్చి చంపారు. ఇదే తరహాలో పాకిస్తాన్ వ్యాప్తంగా పలువురు ఉగ్రవాదుల హత్యలు జరిగాయి. అయితే, ఈ చనిపోయిన ఉగ్రవాదులకు భారత్‌లో ఏదో విధంగా సంబంధం ఉండటం గమనార్హం.
ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి రవి సిన్హా సోమవారం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) కొత్త చీఫ్‌గా నియమితులయ్యారు.