బాలీవుడ్ స్టార్ యాక్టర్ చుంకీ పాండే కూతురిగా సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చింది అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2, పతి పత్ని ఔర్ ఓ సక్సెస్ తో మంచి జోష్ చూపించిన గ్లామరస్ డాల్ హ్యాట్రిక్ హీరోయిన్ గా మారడానికి అడ్డుకట్ట వేసింది లైగర్ సినిమా. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమా తన కూతురికి ఇష్టం లేకపోయినా చేసిందంటూ రీసెంట్లీ చుంకీ పాండే పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు కూడా. లైగర్ ఫెయిల్యూర్ నుండి త్వరగానే బయటపడింది ఈ స్టార్ కిడ్.
Also Read : Jana Nayagan : విజయ్ సినిమా కోసం రంగంలోకి ముగ్గురు దర్శకులు..?
2019లో కెరీర్ స్టార్ట్ చేసిన అనన్య పాండే ఇప్పటి పది సినిమాలు చేస్తే వాటిల్లో ఎక్కువగా ఓటీటీ సినిమాలే ఉన్నాయి. ఖాళీ పీలి, గెహరాహియా, ఖో గయా హమ్ ఖహ, సీటీఆర్ఎల్ లాంటి సినిమాలతో డిజిటల్ ప్రేక్షకులకు కనువిందు చేసింది ఈ నార్త్ బ్యూటీ. మరో రెండు చిత్రాల్లో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది. 2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్ 2 తర్వాత మేడమ్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. అనన్య కన్నా ఒక ఏడాది ముందు వచ్చిన జాన్వీ టాలీవుడ్, బాలీవుడ్ నెక్ట్స్ కోలీవుడ్ అంటూ చక్కర్లు కొట్టేస్తుంటే ఈ మేడమ్ ఇంకా ఓటీటీ సినిమాలకే పరిమితమైంది. దీంతో లేటుగా రియలైజైన అమ్మడు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఫోకస్ చేస్తుంది. ప్రజెంట్ మేడమ్ చేతిలో టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కిల్ మూవీతో పాపులరైన లక్ష్య హీరోగా చాంద్ మేరా దిల్ లో నటిస్తోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తర్వాత మళ్లీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీలో కనిపిస్తోంది ఈ స్టార్ కిడ్. మార్చి 15 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే కేసరి చాప్టర్ 2లోను నటిస్తోంది అనన్య.