కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి లాస్ట్ మూవీగా చెప్పుకుంటున్న జననాయగన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ రాజకీయు పార్టీ ప్రమోషన్లలో విజయ్ బిజీగా ఉండటం వల్ల అనుకున్న టైంకి సినిమాను తీసుకురాలేని పరిస్థితి. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో పూజా హెగ్డే, మమితా బైజు కీ రోల్స్ చేస్తున్నారు. బాబీ డియోల్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు.
Also Read : Bollywood : హిందీలో బిజీ బిజీగా టాలీవుడ్ బ్యూటీ
గోట్ అనుకున్న విజయం సాధించకపోవడంతో పాటు జన నాయగన్ విజయ్ కెరీర్ లో స్పెషల్ ఫిల్మ్ కావడంతో ఈ సినిమాకు అదనపు హంగులు అద్దుతున్నాడు హెచ్ వినోద్. ఈ సినిమా కోసం విజయ్ తో వర్క్ చేసిన ముగ్గురు డైరెక్టర్లను రంగంలోకి దింపుతున్నాడట హెచ్ వినోద్. కోలివుడ్ డైరెక్టర్స్ అట్లీ, లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ లు విజయ్ 69లో స్పెషల్ క్యామియో అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారన్నది కోలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతూన్న బజ్. తేరీ, మెర్సల్, బిగిల్ రూపాల్లో విజయ్ కు హ్యాట్రిక్ హిట్ ఇచ్చాడు అట్లీ. అలాగే మాస్టర్, లియోతో డబుల్ హిట్స్ అందించాడు లోకేశ్, బీస్ట్ ని డైరెక్ట్ చేశాడు నెల్సన్. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లకుండా ఉంటే వీరి దర్శకత్వంలో మూవీస్ కచ్చితంగా చేసేవాడు విజయ్. ఇప్పుడు జననాయగన్ లాస్ట్ సినిమా అని ప్రచారం కావడంతో మరోసారి దళపతితో వర్క్ చేసే ఛాన్స్ వస్తుందో లేదో అని దర్శకులు యాక్టర్లుగా మారిపోయారట. విజయ్ 69లో ఈ ముగ్గురు జర్నలిస్టులుగా కనిపించబోతున్నారట. ఈ ముగ్గురు డైరెక్టర్లతో కలిసి ఓ సాంగ్ కూడా ఉందని కంప్లీట్ అయినట్లు టాక్ నడుస్తోంది.