మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ అంటే మామూలు విషయం కాదు. అలాంటిది చిరు తనయుడుగా వచ్చి చిన్న చిన్నగా తనలోని నటుడిని నిద్రలేపాడు రామ్ చరణ్. ప్రజంట్ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘RRR’ సినిమాతో ఎలాంటి పాత్రలోనైనా సరే అలవోకగా నటించగలిగే కెపాసిటీ తనకు ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా ‘గేమ్ ఛేంజర్’ మూవీతో హిట్ అందుకున్న చరణ్, ప్రజంట్ దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఇండియాలో ఉన్న దర్శకులందరు సినిమాలు చేయాలని చూస్తున్నారట. అందులో లోకేష్ ఒక్కరు.
Also Read: Nidhi Agarwal : హీరోతో ‘ఆ పని చేయొద్దు’ అంటూ అగ్రిమెంట్
అవును తమిళ స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ సైతం రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. చరణ్ తో సినిమా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడట. ఇప్పటికే రామ్ చరణ్ కి కథ కూడా వినిపించినట్లు టాక్. కాగా ఆ కథను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడట లోకేష్. ఈ వార్త వైరల్ అవుతుండటంతో వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ తో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ‘విక్రమ్ 2’ ప్రాజెక్ట్ ను తెరమీదకి తీసుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇక ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆయన రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం ఉందేమో చూడాలి.