వరుస ప్లాపులందుకున్న టైంలో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ మార్చేసిన మూవీ కార్తీకేయ. ఈ సినిమా హిట్టుతో స్క్రిప్ట్ సెలక్షన్ సీరియస్‌గా తీసుకున్నాడు యంగ్ హీరో. సెలక్టివ్ కథలతో సక్సెస్ చూశాడు. ఇక కార్తీకేయ2తో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్ తెచ్చుకోవడంతో వల్ల కాస్తఅపుడో గ్రాఫ్ డౌన్ అయినట్లు కనిపించింది. దీంతో తర్వాతి సినిమాలపై గట్టిగా ఫోకస్ చేస్తున్నాడు నిఖిల్.
Also Read : IPL : ఐపీల్ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న బాలీవుడ్.. కారణం ఏంటంటే.?
ప్రజెంట్ నిఖిల్ చేతిలో స్వయంభు, ద ఇండియా హౌజ్ చిత్రాలున్నాయి. ఈ రెండు కూడా పీరియడిక్ చిత్రాలే. ఏడాది క్రితమే స్టార్టైన స్వయంభు 95 శాతం కంప్లీట్ చేశామని, చాలా సీక్రెట్‌గా షూటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా స్వయంభు తెరకెక్కుతున్నట్లు వెల్లడించాడు. ఇక ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు నిఖిల్. ఇందులో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వయంభుతో పాటు ది ఇండియా హౌస్ అనే మూవీని చేస్తున్నాడు నిఖిల్. లవ్ అండ్ రెవల్యూషన్ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో నిఖిల్ సరసన సాయీ మంజ్రేకర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ వెంచర్‌లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు రామ్ చరణ్. ఈ రెండు కంప్లీట్ అయ్యాక కార్తీకేయ 3కి వర్క్ చేయబోతున్నట్లు హింట్ ఇచ్చాడు యంగ్ హీరో. మొత్తానికి పాన్ ఇండియా కాన్సెప్టులను లైన్లో పెడుతున్న నిఖిల్ సిద్దార్థ్ పాన్ ఇండియా హీరోగా నిలదొక్కుకుంటాడో లేదో చూడాలి.