నిధి అగర్వాల్.. చిన్న హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ నుంచి ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో ‘మజ్ను’ మూవీ చేసింది. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ అందుకున్న నిధి, ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. ప్రజంట్ ఈ అమ్మడు ఇప్పుడు ఇద్దరు బడా స్టార్స్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’, అలాగే ప్రభాస్ తో ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి.. తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం పంచుకుంది.
Also Read: Spirit : ‘స్పిరిట్’లో ప్రభాస్ అన్నగా ఆ స్టార్ హీరో..!
‘ బాలీవుడ్ చిత్రం ‘మున్నా మైకేల్’ మూవీ తో నా సినీ కెరీర్ మొదలైంది. టైగర్ ప్రొఫ్ హీరోగా నటించారు. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత టీమ్ నాతో ఒక కాంట్రాక్ట్పై పై సంతకం చేయించుకుంది. సినిమాకు సంబంధించిన నేను పాటించాల్సిన విధానాలు ఆ కాంట్రాక్ట్‌లో రాసి ఉన్నాయి. అందులోనే నో డేటింగ్ అనే షరతు పెట్టారు. సినిమా పూర్తయ్యేవరకూ హీరోతో నేను డేట్ చేయకూడదు దాని అర్థం. అయితే కాంట్రాక్ట్ మీద సంతకం చేసినప్పుడు నేను పెద్దగా అవన్నీ చూడలేదు. ఆ తర్వాత నాకు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయా. నటీనటులు ప్రేమలో పడితే మూవీ పై దృష్టిపెట్టరనన్ని ఆ టీమ్ భావించి ఇలాంటి షరతులు పెట్టి ఉంటుంది’ అని నిధి అగర్వాల్ తెలిపింది.