నితిన్ హీరోగా వస్తున్న సినిమా రాబిన్ హుడ్. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అనేక మార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి ఈ నెల 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
Also Read : Nikhil : ఆ రెండు పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏంటంటే..?
వరుస ఫ్లోప్స్ తో సతమతమవుతున్న నితిన్ లాంగ్ గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా రాబిన్ హుడ్. కాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ను విడుదల చేయాలని భావించిన టీమ్ ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ చేస్తూ అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఈ ఆదివారం అనగా 23న హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య అతిధిగా రానున్నాడు. ఈ స్టార్ బ్యాట్స్ మెన్ రాబిన్ హుడ్ సినిమాలో ఓ కీలక పాత్రలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ముందుగా ఈ వేడుకను యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఓపెన్ గ్రౌండ్ లో నిర్వహించాలని ప్లాన్ చేయగా అందుకు అనుమతులు లభించకపోవడంతో ఇండోర్ ఈవెంట్ లా చేస్తున్నారు మేకర్స్.