నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తూ.. పరీక్షలను నిర్వహిస్తూ.. వేగంగా ఫలితాలను ప్రకటిస్తూ నియామకాలు చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్ 1,2,3 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా గత సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలన అధికారుల (GPO ) పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read:Nikhil : ఆ రెండు పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏంటంటే..?
నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు “జిపిఓ” గా నామకరణం చేసింది. కాగా రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది. మళ్లీ గ్రామ పాలన అధికారులను నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.