ఐపీఎల్ ఫీవర్ స్టార్టైందంటే టాలీవుడ్ బాలీవుడే కాదు టోటల్ బాక్సాఫీస్ కి చలి జ్వరం మొదలైనట్లే. యూత్, క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. దీంతో థియేటర్లు వెలవెలబోతుంటాయి. అందుకే ఐపీఎల్ షెడ్యూల్ రాగానే ఆ టైంలో స్లాట్ బుక్ చేసుకున్న బొమ్మలు సందిగ్థంలో పడ్డాయి. మార్చి 22 నుండి మే25 వరకు మ్యాచులు జరగబోతున్నాయి. ఈ టైంలో రిస్క్ చేయడం ఎందుకులే అని కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. వాటిల్లో ఒకటి అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్బీ 3. జాలీ ఎల్ఎల్బీ వెంచర్ నుండి రాబోతున్న ధర్డ్ ఫ్రాంచైజీ ఇది.
Also Read : Mollywood : లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా చేస్తోన్న స్టార్ కిడ్
జాలీ ఎల్ఎల్బీ3ని ఫస్ట్ ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఐపీఎల్ కారణంగా ఆగస్టుకు వాయిదా పడింది. ఇక ఇదే రోజున వద్దామనుకున్నారు వరుణ్ ధావన్ అండ్ జాన్వీ కపూర్. బవాల్ తర్వాత సెకండ్ టైం జోడీకట్టిన సన్నీ సంస్కారీ తులసి కుమారి. ఏప్రిల్ 18నే రిలీజ్ కావాల్సి ఉండగా సెప్టెంబర్ 12కి జరిగింది. ఈ రెండు సినిమాలు పోస్ట్ పోన్ అయితే రిస్క్ చేసేందుకు రెడీ అయ్యింది అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్యపాండే స్టారర్ కేసరి2. ఇది మార్చి 14న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అప్పుడు సెట్ కాకపోవడంతో ఏప్రిల్ 18న స్లాట్ బుక్ చేసుకున్నారు మేకర్స్. ఇక సమ్మర్ సీజన్లో ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసుకున్న కొన్ని సినిమాలు కూడా సందిగ్థంలో పడ్డాయని తెలుస్తోంది. గత ఏడాదే రిలీజ్ కావాల్సిన త్రిప్తి దిమ్రి, సిద్దాంత్ చతుర్వేది దడక్ 2హోలీకి రిలీజ్ కావాల్సి ఉండగా ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ అయ్యింది. ఏప్రిల్, మేలో రావాలా వద్దా అన్నడౌట్‌లో టీం ఉన్నట్లు టాక్. దడక్ 2లానే లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాల్సిన మెట్రో ఇన్ డినో ఐపీఎల్ వల్ల జులై4కి దుకాణం సర్దుకుందని సమాచారం. అలాగే ఇదే సీజన్ క్యాష్ చేసుకోవాలనుకుంటన్నాయి కొన్ని బొమ్మలు. అలా రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నాయి సికందర్, జాట్, భూల్ చుక్ మాఫ్, కేసరి2, రైడ్2, భూత్ని లాంటి చిత్రాలు. సికందర్ అంటే సల్మాన్ ఈద్ సెంటిమెంట్ కనుక బొమ్మ కన్ఫర్మ్ గా వచ్చి తీరుతుంది. మరీ మిగిలిన సినిమాలు అనుకున్న టైంకి వస్తాయో లేదో.