సోషల్ మీడియా యాప్స్ పుణ్యమా అని పాపులరైన ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ, ఇన్ స్టాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా రాణించింది. సాఫ్ట్ వేర్ డెవలపర్ , మిస్సమ్మ ఆమెను క్రేజీ బ్యూటీని చేశాయి. దీంతో మెల్లిగా సిల్వర్ స్క్రీన్ పై అడుగెట్టింది. టచ్ చేసి చూడుతో సైడ్ క్యారెక్టర్‌తో స్టార్టైన ఆమె బేబీతో హీరోయినయ్యింది. బేబిలో సూపర్ ఫెర్మామెన్స్‌తో ఓవర్ నైట్ హేట్రెట్ తెచ్చుకుంది. ఇది ముందు ఊహించింది కాబట్టే నిలదొక్కుకుంది. ఇదే టైంలో బేబి నిర్మాతతో నెక్ట్స్ రెండు ప్రాజెక్టులు చేసే ఛాన్స్ కొట్టేసింది.
Also Read : Nithiin : రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వెన్యూ ఛేంజ్
ఆ తర్వాత సెకండ్ మూవీగా వచ్చిన లవ్ మీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బేబీ నిర్మాతతో సినిమా అనుకుంటే అది సెట్ కాలేదు. ఆటైంలో వచ్చిందే జాక్. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డతో జతకడుతోంది. రీసెంట్లీ ఆనంద్ దేవరకొండతో మరో మూవీకి కమిటయ్యింది. ఇప్పటి వరకు ఆనంద్, ఆశిష్ లాంటి జూనియర్ హీరోలతో జతకట్టిన వైష్ణవి ఫస్ట్ టైం ఓ స్టార్ హీరోతో జోడీ కడుతోంది. టిల్లుతో యూత్‌లో సిద్దుకు ఉన్న క్రేజ్ వేరే లెవల్. మరి అలంటి హీరోని వైష్ణవి మ్యాచ్ చేయగలిగలదా లేదా అన్న డౌట్ కలుగుతోంది. అలాగే సిద్దు స్వాగ్ క్యాచ్ చేసిందా లేదా అన్న పాయింట్ కూడా ఉంది. ఈ అనుమానాలకు క్లారిటీ రావాలంటే ఏప్రిల్ 10 జాక్ రిలీజ్ వరకు ఆగాల్సిందే. అయితే లవ్ మీతో ట్రాక్ తప్పిన తనని జాక్‌తో సిద్దు హిట్ ఇచ్చి ఆదుకుంటాడని అమ్మడు ఆశగా ఎదురు చూస్తుంది.