ప్రజంట్ ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు హీరోలతో సమానంగా గుర్తింపు.. క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అందులో సందీప్ రెడ్డివంగ ఒక్కరు. మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’ తో తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసి, ఇదే మూవీని హిందీలో కూడా తీసి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు సందీప్. ఇక రన్‌బీర్ కపూర్ తో చేసిన ‘అనిమల్’ సినిమా వెరే లెవల్ అని చెప్పాలి. ఈ మూవీ భారీ విజయాంతో ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో ఉహించని పాపులారిటి దక్కింది. ఇక అతని తదుపరి చిత్రం ప్రభాస్ తో చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ‘స్పిరిట్’ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకులు ఎంతో హోప్ తో ఉన్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన వార్త ఒక్కటి వైరల్ అవుతుంది.
Also Read: Odela 2 : ‘ఓదెల 2’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ప్రభాస్ ప్రజంట్ ‘ఫౌజీ’ అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ మూవీ పూర్తి అయిన తర్వాత సందీప్‌తో చేయబోయే ‘స్పిరిట్’ పట్టాలెక్కబోతుందట. ప్రభాస్ రేంజ్ ఏంటో మనకు తెలిసిందే. రణ్ బీర్ నే అంత పవర్ ఫుల్‌గా చూపించాడు అంటే ప్రభాస్ విషయంలో ఆయన ఐడియాలజీ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.ఈ మూవీ కనుక భారీ విజయాన్ని సాధించినట్లయితే సందీప్ వంగ స్టార్ డైరెక్టర్‌గా మరోమెట్టు ఎక్కుతాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ రానప్పటికీ, తాజాగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ అన్న గా సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.