Electronics Premier League: కొత్త స్మార్ట్ టీవీ లేదా ప్రాజెక్టర్ కొనుగోలు చేసి IPL 2025 మ్యాచ్‌లను గ్రాండ్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే, అమెజాన్ ఇండియా అందిస్తున్న ప్రత్యేక డీల్స్ మిస్ కాకండి. ఇందుకోసం అమెజాన్ సరికొత్త ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్’ ను తీసుక వచ్చింది. ఈ సేల్ మార్చి 21 నుండి 26 వరకు అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ 2025 ముందు అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో శాంసంగ్, సోనీ, LG వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ టీవీలు ఇంకా ప్రాజెక్టర్లపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది.
Read Also: Mobile Addiction: మీ పిల్లలు ఎప్పుడూ ఫోన్లతో బిజీగా ఉంటున్నారా..? ఏం చేస్తే పక్కన పెడతారు..!
అమెజాన్ సూపర్ సేవర్ ఇన్నింగ్స్ ఆఫర్లలలో డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు, కొనుగోలుదారులకు అదనపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో 12 నెలల వరకు నో-కాస్ట్ EMI కొన్ని ప్రామాణిక ఉత్పత్తులపై అందుబాటులో ఉంది. అలాగే కూపన్ డిస్కౌంట్ ద్వారా రూ. 5,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ. 5,250 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ పొందే అవకాశం లభిస్తుంది. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా పాత టీవీ లేదా ప్రాజెక్టర్ ఇచ్చి రూ. 5,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also: Hyderabad: భారీగా కుళ్లిన మేక, గొర్రె మాంసం స్వాధీనం.. ఇక హలీమ్, బిర్యానీలు తిన్నట్లే!
అమెజాన్ 11 నాకౌట్ డీల్స్ భాగంగా భారీ డిస్కౌంట్లతో టీవీలను సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ లో 4K స్మార్ట్ టీవీలు రూ. 750 నెలవారీ EMIతో ప్రారంభం అవుతుంది. ప్రిమియం టీవీల కోసం ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 5,250 వరకు అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. “TV now, pay later” ఆప్షన్ ద్వారా ఫైనాన్స్ సౌకర్యం కూడా అందిస్తున్నారు. ఇందులో విస్తృతమైన 500+ స్మార్ట్ టీవీల ఎంపిక ఉంది. ప్రైమ్ మెంబర్స్‌కు ప్రత్యేక కూపన్ ఆఫర్లు కూడా లభించనున్నాయి. ఈ సేల్ లో భాగంగా 4 ఏళ్ల వరకు పొడిగించిన వారంటీ కూడా పొందే అవకాశం ఉంది. ఉచిత డెలివరీ, సులభమైన రీప్లేస్‌మెంట్ గ్యారంటీ కూడా పొందవచ్చు. మీరు కొత్త టీవీ లేదా ప్రాజెక్టర్ కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, అమెజాన్ ఇండియా అందిస్తున్న ఈ ప్రత్యేక ఐపీఎల్ సేల్‌ను వదులుకోకుండా ప్రయోజనం పొందండి.