Poonam Kaur: కేరళ రాకుమారి కాళ్ళ వద్ద పూనమ్ కౌర్.. ఫొటో వైరల్
- ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం
- కేరళ రాయల్ క్లాన్ తో ఆకట్టుకున్న నటి పూనమ్ కౌర్
- పూయం తిరునాళ్ పద్మనాభ సేవిని గౌరీ పార్వతి బాయి
- పద్మనాభ సేవిని పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరీ లక్ష్మీ బాయిలను కలిసిన పూనమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Kaur Met Kerala’s Royal Clan on National Handloom Day: ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం, భారతదేశ సాంస్కృతిక, ఆర్థిక వ్యవస్థలో భాగమైన చేనేత కార్మికుల యొక్క కీలక పాత్రను, ప్రాముఖ్యతను తెలియజేసే రోజుది. అందులో భాగంగా ఈ ఏడాది నటి పూనమ్ కౌర్ చేనేత కళ పట్ల తన మద్ధతుని తెలియజేసింది.. ఆమె హృదయపూర్వకమైన కథను తెలియజేసింది.
చేనేత, చేనేత వస్త్రాలపై పూనమ్ కౌర్ పరిశోధన చేస్తున్నారు. అలాగే న్యాయవాది కూడా అయిన ఆమెకు కేరళలోని ఇద్దరు యువరాణులు కలిసే సువర్ణావకాశం దక్కింది. వారే పూయం తిరునాళ్ పద్మనాభ సేవిని గౌరీ పార్వతి బాయి, పద్మనాభ సేవిని పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరీ లక్ష్మీ బాయిలను కలిశారు పూనమ్. ఈ సందర్భంలో కేరళ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో తమ అనుభవాలను, అభిరుచిని ఇద్దరు యువరాణిలు తెలియజేశారు. పూయం తిరునాళ్ పద్మనాభ సేవిని గౌరీ పార్వతి బాయి పద్మనాభ స్వామి ఆలయం పట్ల తనకున్న భక్తిని తెలియజేయగా, పద్మనాభ సేవిని పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరీ లక్ష్మీ బాయి పూనమ్‌కు అందమైన కేరళ చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు.
Also Read
ఆటోఇమ్యున్ డిజార్డర్‌తో బాధపడుతున్నప్పటికీ పూనమ్ కౌర్ చేనేత అభివృద్ధిలో భాగంగా చేసున్న పనికి నిబద్ధతతో కట్టుబడి ఉన్నారు. అలాగే ఓ కొత్త ప్రాజెక్ట్‌ను చేపట్టాలని చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న యువరాణులు దేశంలోని చేనేత కార్మికులకు మంచి భవిష్యత్త ఉండేలా చూడాలని కోరటమే కాకుండా పూనమ్ చేయనున్న భవిష్యత్ కార్యాచరణలన్నీ విజయవంతం కావాలని అభిలషించారు. ఈ అపూర్వ కలయిక కాలానికి, సామాజిక హద్దులకు అతీతంగా చేనేతల శాశ్వత సాంస్కృతిక ప్రాముఖ్యతను చేకూర్చేలా కనిపిస్తోంది.
నేటి జాతీయ చేనేత దినోత్సవం అనేది 1905 నాటి స్వదేశీ ఉద్యమాన్ని గుర్తుకు తెస్తుంది. భారతీయ తయారీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వటమే దీని ప్రధానోద్ధేశం. ఈ సంవత్సరం జాతీయ చేనేతో దినోత్సవ 10 వ వార్షికోత్సవం. భారతదేశం అంతటా వేడుకలు మరియు కార్యక్రమాలు జరుగుతున్నాయి. చేనేత పరిశ్రమను ప్రోత్సహించడంలో పూనమ్ కౌర్ అంకిత భావంతో పని చేస్తున్నారు. ఇటీవల రాయల్టీతో ఆమె ఎదుర్కొన్న అనుభవం ఆమె అభిమానులకు మరింత స్ఫూర్తినిచ్చింది. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, మహిళలు మరియు నేత కార్మికుల సాధికారత కోసం పూనమ్ చూపిస్తున్న నిబద్ధతను అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత పరిశ్రమ గణనీయంగా తోడ్పాటుని అందిస్తోంది. దీని వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. భిన్నత్వంలో ఏకత్వంలా ప్రతి ప్రాంతంలోనూ అద్భుతమైన వైవిధ్యాలలను చేనేత మనకు ఆవిష్కరిస్తుంది. ఈ వైవిధ్యం భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
బనారసి, జమ్దానీ నుంచి బాలుచారి, ఫుల్కారీ వరకు సంక్లిష్టమైన చేనేత పనులు, డిజైన్లు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఆకర్షణను సంతరించుకున్నాయి. సహజ ఫైబర్స్, సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించడం స్థిరమైన ఫ్యాషన్స్ ప్రోత్సహిస్తుంది, ఇది శతాబ్దాల పురాతన చేనేత వారసత్వాన్ని గౌరవిస్తుంది.
పూనమ్ కౌర్ ఇందులో భాగం కావటంతో చేనేత పరిశ్రమ ఎంత విలువైనదో అందరికీ అవగాహన పెరుగుతోంది. ఈ కీలక రంగానికి మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకతను అందరికీ తెలియజేస్తోంది. ప్రతి చేనేత సృష్టిలో అల్లుకున్న కళాత్మకత మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను జాతీయ చేనేత దినోత్సవం గుర్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
-
Bunny – Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
-
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
-
Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!