Nithin : యంగ్ హీరో నితిన్ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ కు పాజిటివ్ టాక్ రావడంతో ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఈవెంట్ లో జయం సినిమాలో ముందుగా రష్మీనే తీసుకున్నాం అని చెప్పడం సంచలనం రేపుతోంది. రాబిన్ హుడ్ ప్రమోషన్ల కోసం మూవీ టీమ్ తాజాగా ఓ ప్రోగ్రామ్ కు వచ్చారు. అందులో యాంకర్ గా చేస్తున్న రష్మీ గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు నితిన్. నితిన్ మొదటి మూవీ జయం సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్. ఇందులో సదా హీరోయిన్ గా చేసింది. తేజ డైరెక్షన్ లో వచ్చిన సినిమా యూత్ ను ఓ ఊపు ఊపేసింది.
Read Also : Pakistan: వణికిస్తున్న భూకంపాలు.. పాకిస్తాన్‌లో 4.6 తీవ్రతతో భూకంపం
ఈ సినిమా గురించి నితిన్ మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో ముందుగా రష్మీనే తీసుకున్నాం. ఆమె 90 శాతం సీన్లు రిహార్సల్స్ చేశాను. కానీ చివర్లో ఏమైందో తెలియదు. సదాను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ రష్మీనే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసి ఉంటే ఆ రోజుల్లోనే స్టార్ హీరోయిన్ అయిపోయి ఉండేదేమో. ఆమె సినిమాల్లో ఛాన్సుల కోసం చాలా కష్టపడింది. చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. కానీ యాంకర్ అయిన తర్వాతనే ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చింది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కావాలన్న ఆమె కల కలగానే మిగిలిపోయింది. కొన్ని సినిమాల్లో ఛాన్సులు వచ్చినా పెద్దగా కలిసి రాలేదు.