ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై తొలి చిత్రం (ప్రొడక్షన్ నెంబర్ 1)గా రూపొందుతున్న ఈ స్కైఫై డ్రామా, కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ సోమవారం (మార్చి 31, 2025) అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. డా. లతా రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టి శుభ సూచనలు చేశారు.
Pragya Jaiswal : చూపు తిప్పుకోనివ్వని అందాలతో ప్రగ్యాజైస్వాల్ రచ్చ..
పూజా కార్యక్రమంలో వీవీ వినాయక్ ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొడితే, మల్లిడి వశిష్ట దాన్ని డైరెక్ట్ చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. నిర్మాతలు బెల్లంకొండ సురేష్ తదితరులు హాజరై ఈ వేడుకకు వన్నె తెచ్చారు. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలవనుంది. “2012లో సినీ రంగంలోకి వచ్చి, ఎన్నో ఒడిదొడుకుల తర్వాత దర్శకుడిగా మీ ముందుకు వచ్చాను. నిర్మాత లతా గారికి కృతజ్ఞతలు. ఓటీటీ యుగంలో స్కైఫై డ్రామా తీయడం సాహసం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాను,” అని మల్లిడి కృష్ణ ఉత్సాహంగా చెప్పారు. జగపతి బాబు, వైవా హర్ష, బబ్లూ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అమర్నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, జీవన్ ఫైట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. స్కైఫై డ్రామాతో ప్రేక్షకులను మెప్పించేందుకు మల్లిడి కృష్ణ సిద్ధమవుతున్నారు.