Adi Reddy : ఇప్పుడు టాలీవుడ్ ను బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కుదిపేస్తోంది. చిన్న సెలబ్రిటీల దగ్గరి నుంచి స్టార్ హీరోల దాకా అందరూ ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకున్నారు. చాలా మందిపై కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆదిరెడ్డి కూడా పోలీసు స్టేషన్ కు రావడం కలకలం రేపింది. ఆయన స్టేషన్ కు రావడంతో ఆయనపై కూడా కేసు నమోదైందేమో అనే ప్రచారం జరిగింది. దానిపై ఆదిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ‘నేను ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. నా పేరుతో కొన్ని టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాటిపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని తెలిపాడు.
Read Also : Nithin : జయం మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా రష్మీనే తీసుకున్నాం : నితిన్
‘నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి అనుకుంటే.. నాకు కోట్లు ఇస్తామని ఆఫర్లు వచ్చాయి. కానీ నేను చేయలేదు. గతంలో ఫాంటసీ అనే యాప్ ను ప్రమోట్ చేశాను. కానీ అది మన తెలంగాణ, ఆంధ్రాలో ఓపెన్ చేయొచచు. అది లీగల్ యాప్. అందులో కేవలం ఫ్రీ లీగ్స్ మాత్రమే ఆడుకోవచ్చు. కానీ తర్వాత దాన్ని కూడా బ్యాన్ చేయడంతో ఆపేశాను. దయచేసి ఎవరూ బెట్టింగ్ ఆడొద్దు. అందరం దానికి వ్యతిరేకంగా పోరాడుదాం’ అంటూ పిలుపునిచ్చాడు ఆదిరెడ్డి. బిగ్ బాస్ తో ఫేమస్ అయిన ఆదిరెడ్డి.. ఆ తర్వాత టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూనే టీవీషోలు, చిన్న సినిమాల్లో అవకాశాలు వస్తే చేస్తున్నాడు.