నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా సీక్వెల్ అయిన ‘అఖండ 2’ విడుదలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సినిమా విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ‘అఖండ 2’ సినిమా థియేట్రికల్, డిజిటల్ విడుదలలన్నింటినీ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ S.M. సుబ్రమన్యం మరియు జస్టిస్ C. కుమారప్పన్ లతో కూడిన […]
అఖండ 2 ప్రీమియర్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న బాలకృష్ణ అభిమానులకు సినిమా టీమ్ షాకింగ్ న్యూస్ చెప్పింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా అఖండ 2 తాండవం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ ఖరారు చేశారు. అయితే, ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్‌తో సినిమా ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసినట్లుగా సినిమా […]
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓహారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా […]
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ (బాబు) వ్యవహారంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. శ్రీతేజకు అన్ని విధాలా అండగా ఉంటామని, పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే ఆయన మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయల డబ్బులు డిపాజిట్ చేయడం జరిగింది. దీనిపై వచ్చే వడ్డీ డబ్బులను ప్రతినెల శ్రీతేజ తండ్రికి అందేలా ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ఖర్చుల కింద దాదాపు 70 లక్షల రూపాయలు చెల్లించారు. ప్రస్తుతం శ్రీతేజకు అవసరమైన […]
గత ఏడాది సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ తండ్రి భాస్కర్ తో NTV Exclusiveగా మా ప్రతినిధి మాట్లాడారు. ఈ సందర్భంగా భాస్కర్ తమ కుటుంబం పడిన బాధలను, ప్రస్తుత పరిస్థితిని వివరించారు. “గత ఏడాది ఇదే రోజు, ఇదే సమయానికి సంధ్య థియేటర్ లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో కోసం వచ్చాము. కానీ ఆ తొక్కిసలాటలో నా భార్య రేవతిని కోల్పోయాను” అంటూ […]
సినిమాలు మళ్లీ విడుదల అవ్వడం (రీ-రిలీజ్లు) ఇప్పుడు టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. అభిమానుల సందడి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు.. ఇవన్నీ రీ-రిలీజ్‌లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అయితే, ఈ ట్రెండ్‌లో మెగాస్టార్ చిరంజీవి మాత్రం అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోతున్నారు. ఎన్నో క్లాసిక్ హిట్స్ ఉన్నప్పటికీ, మెగాస్టార్ పాత సినిమాలు రీ-రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగులుస్తున్నాయి. మెగాస్టార్ కెరీర్లో ‘గ్యాంగ్‌లీడర్’, ‘ఘరానా మొగుడు’, ‘కొదమ సింహం’ వంటి ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. […]
సాధారణంగా నటీమణులు తమ కెరీర్లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. ఆ ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది నటి సంయుక్త మీనన్. అచ్చం పద్ధతికి లంగా ఓణీ వేసినట్టుగా, తెలుగు ప్రేక్షకులకు ఎంతో నచ్చిన డిగ్నిఫైడ్ రోల్స్ చేసిన సంయుక్త, ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంయుక్త మీనన్ అంటే, అందమైన నవ్వు, చక్కటి నటన, ముఖ్యంగా […]
తెలంగాణ సంస్కృతి, కళలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రపంచ ప్రతినిధులను మన భిన్న సాంస్కృతిక మరియు కళారూపాలతో ఆహ్వానించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య ఆకర్షణగా, ఆస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన అద్భుతమైన సంగీత కచేరితో అతిథులను అలరించనున్నారు. ఆయన 90 నిమిషాల పాటు ప్రత్యేక సంగీత కచేరిని నిర్వహించనున్నారు. కీరవాణి […]
బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అఖండ తెలంగాణ రేట్ల పెంపు జీవో కొద్దిసేపటి క్రితమే జారీ అయింది. టికెట్ రేట్ల పెంపుతో పాటు, ముందు రోజు రాత్రి 8 గంటలకు ఒక షో వేసుకునే పర్మిషన్ కూడా కల్పించారు. జీవో జారీ చేసిన దాని ప్రకారం, అఖండ ఐదో తేదీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే, ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ముందు రోజు అంటే నాల్గవ తేదీ రాత్రి 8 గంటలకు రూ.600 టికెట్ […]
బాలకృష్ణ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో రూపొందిన అఖండ తాండవం సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ అంటే రేపు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ప్రీమియర్స్‌తో ఒకరోజు ముందుగానే ప్రదర్శిస్తున్నట్లు సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సహా ఓవర్సీస్లో ప్రీమియర్స్ పడుతున్నాయి. ఈ మేరకు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కానీ, తెలంగాణలో మాత్రం ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అయితే, తెలంగాణలో టికెట్ […]