Rashmika : నేషనల్ క్రష్ రష్మిక స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీకి.. సికిందర్ రూపంలో దిమ్మతిరిగే షాక్ తగిలింది. వరుసగా యానిమల్, పుష్ప-2, ఛావా లాంటి నేషనల్ హిట్ సినిమాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఇండియాలో వరుసగా ఇన్ని పెద్ద సినిమాల్లో ఎవరూ నటించలేదు కాబోలు. ఆ అవకాశం రష్మికకే దక్కింది. అంత పెద్ద క్రేజ్ సంపాదించుకున్న తర్వాత ఆమె ఎంచుకునే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ సల్మాన్ ఖాన్ లాంటి హీరో సరసన ఛాన్స్ అనేసరికి పాత్ర గురించి కనీసం ఆలోచించలేదా అనిపిస్తోంది.
Read Also : Pragya Jaiswal : చూపు తిప్పుకోనివ్వని అందాలతో ప్రగ్యాజైస్వాల్ రచ్చ..
మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రష్మిక పాత్ర ఫస్ట్ హాఫ్ లోని 40 నిముషాల వరకే పరిమితం చేయడం మరీ విడ్డూరంగా ఉందంటున్నారు ఆమె ఫ్యాన్స్. అదేదో గెస్ట్ రోల్ అన్నట్టు అంత తక్కువ స్క్రీన్ టైమ్ ఉందేంటి అంటున్నారు. కనీసం రష్మిక పాత్రకు ప్రాధాన్యత దక్కిందా అంటే అదీ లేదు. ఇందులో ఆమె చనిపోతుంది. పైగా కథ కూడా వీక్ గా ఉంది. ఇలాంటి పాత్ర కోసం రష్మిక అంత రిస్క్ చేయడం అవసరమా అన్నట్టు కామెంట్లు చేస్తున్నారు సినీ లవర్స్. వరుస హిట్లతో ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న టైమ్ లో ఇలాంటి సినిమా చేసి రిస్క్ చేసిందా అంటున్నారు. ఇక నుంచి అయినా ఆమె ఎంచుకునే కథలు, పాత్రల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.