MI vs KKR: ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ లో బోణి కొట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేపట్టింది. కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 16.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై ఇండియన్స్ బౌలర్ అశ్విని కుమార్ 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడంతో కోల్కతా నైట్ రైడర్స్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యింది.
Read Also: Egg Price Hikes In US: మండుతున్న గుడ్ల ధరలు.. డజను గుడ్ల ధర రూ. 870
ఇక స్వల్ప టార్గెట్ ను ముంబై ఇండియన్స్ జట్టు సునయాసంగా ఛేజింగ్ చేసింది. కేవలం 12.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి సీజన్ లో మొదటి విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్స్ లో రోహిత్ శర్మ 13 పరుగులకే వెనుతిరిగి అభిమానులను మరోమారు నిరాశపరిచాడు. మరో ఓపనర్ ర్యాన్ రికెల్టన్ 62 పరుగులతో నౌ అవుట్ గా నిలిచాడు. విల్ జాక్స్ 16 పరుగులు చేసి అవుట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి 9 బంతులతో 27 పరుగులు చేశాడు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ లో ఆండ్రే రస్సెల్ రెండు వికెట్లు నేలకూల్చాడు. మొత్తానికి మూడో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఖాతా తెరచడంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.