యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిస్తే ఆ రంగంపై ఆధారపడ్డవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని.. అందుకే అంతా వారంలో ఒక్కసారైనా చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు (ఆగస్టు 7న) గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
Golden Shawl: రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ తన ప్రత్యేక నైపుణ్యంతో మరోసారి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా త్రివిధ దళాల (సైన్యం, నౌకాదళం, వాయుసేన) చిత్రాలను బంగారు శాలువాపై నేసి తన దేశభక్తిని చాటుకున్నాడు.
Poonam Kaur Met Kerala’s Royal Clan on National Handloom Day: ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం, భారతదేశ సాంస్కృతిక, ఆర్థిక వ్యవస్థలో భాగమైన చేనేత కార్మికుల యొక్క కీలక పాత్రను, ప్రాముఖ్యతను తెలియజేసే రోజుది. అందులో భాగంగా ఈ ఏడాది నటి పూనమ్ కౌర్ చేనేత కళ పట్ల తన మద్ధతుని తెలియజేసింది.. ఆమె హృదయపూర్వకమైన కథను తెలియజేసింది. చేనేత, చేనేత వస్త్రాలపై పూనమ్ కౌర్ పరిశోధన చేస్తున్నారు. అలాగే న్యాయవాది కూడా…
మంగళగిరితో ముడిపడిన బంధం నన్ను చేనేత కుటుంబ సభ్యుడిని చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర మంత్రి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Pawan Kalyan: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన తరపున చేనేత కళాకారులకు కళాభివందనాలు తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. చేనేత కోసం జాతీయ దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. కళను నమ్మిన వారు అర్ధాకలితో జీవిస్తుండటం దురదృష్టకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వెరవక కొందరు చేనేత కళను సజీవంగా నిలుపుతున్నారని కొనియాడారు. కళారంగంపై లోతైన అధ్యయనం జరగాలని, కళాకారులకు ప్రభుత్వం, ప్రజలు అండగా ఉండాలన్నారు. దేశంలో ప్రతి కుటుంబం వారంలో ఒకసారైనా చేనేత…
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ది చేసుకుంటూ వస్తున్నదన్నారు. మారిన సాంకేతిక యుగంలో పవర్ లూమ్ లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్న దన్నారు. ప్రభుత్వ దార్శనికతతో, మంత్రి కెటిఆర్ కార్యదక్షతతో, గత పాలనలో కునారిల్లిన రాష్ట్ర చేనేత…