Pradeep : యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రదీప్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆయన మొదటిసారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించారు. దాని తర్వాత ఇప్పుడు అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో రాబోతున్నాడు. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్ గా చేస్తోంది. నితిన్ భరత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ కామెడీతో నింపేశారు. మంచి కామెడీ ట్రాక్ తో ఈ సినిమాను తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మూవీ ప్రెస్ మీట్ లో టీమ్ మాట్లాడింది. అయితే పవన్ కల్యాణ్ మొదటి సినిమా పేరును పెట్టుకోవడం వల్ల ఏమైనా భయం లేదా.. ఒకవేళా ఏదైనా తేడా వస్తే పవన్ ఫ్యాన్స్ ఊరుకోరు కదా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.
Read Also : MI vs KKR: హోమ్ గ్రౌండ్ లో రెచ్చిపోయిన ముంబై బౌలర్లు.. కేకేఆర్ 116 ఆలౌట్
దానికి ప్రదీప్ కూడా జెన్యూన్ ఆన్సర్ ఇచ్చాడు. ‘పవన్ కల్యాణ్ గారి మొదటి సినిమా పేరును పెట్టాలని ముందే అనుకోలేదు. సినిమా లైన్ ను బట్టి పెట్టాలని ఫిక్స్ అయ్యాం. కానీ పవన్ కల్యాణ్ మొదటి మూవీ పేరు కాబట్టి ఆ భయం ఉంది. ఆ పేరు చెడగొట్టకుండా సినిమా చేయాలని మేం జాగ్రత్త పడుతున్నాం. కచ్చితంగా ఈ సినిమా అందరినీ అలరిస్తుందనే నమ్మకం మాకుంది’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రదీప్ పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాను కామెడీ బేస్డ్ గా తీస్తున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా పలు షోలు చేస్తున్న ప్రదీప్.. ఇటు సినిమా షూటింగులతో కూడా బిజీగా ఉంటున్నాడు.