BV Raghavulu : సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులో తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు పోటీ పడుతున్నారు. సీపీఎం అఖిల భారత జాతీయ మహా సభలు ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడులోని మధురైలో జరగబోతున్నాయి. 3వ తేదీన ఫెడరలిజం ఈజ్ ధి స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా అనే సెమినార్ నిర్వహిస్తారు. 6వ తేదీన రెడ్ ఫ్లాగ్ ప్రాసెషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజే కొత్త జాతీయ కమిటీని కూడా ఎన్నుకుంటారు. దేశ వ్యాప్తంగా సెలెక్ట్ చేసిన 819 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీ, బీవీ రాఘవులతో పాటు 34 మంది ఈ జాతీయ మహాసభలకు హాజరవుతున్నారు.
Exclusive: యంగ్ హీరోలు మారాల్సిందే.. లేదంటే భారీ మూల్యం తప్పదు
జాతీయ కమిటీలో ప్రస్తుతం 17 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 75 ఏళ్లు దాటిన ఏడుగురు తప్పుకోబోతున్నారు. వారి ప్లేస్ లో కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నారు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారం ఏచూరి మృతి చెందారు. ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ పోస్టు కోసం తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు, కేరళ నుంచి ఎంఏ బేబీ, విజయరాఘవన్, మహారాష్ట్ర నుంచి అశోక్ ధావలే పోటీ పడుతున్నారు. ఇందులో బీవీ రాఘవులుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. చాలా కాలంగా జాతీయ కమిటీలో ఉన్నారు.