గ్లోబల్‌స్టార్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘పెద్ది’ ఒకటి. ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్, వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు, బాలీవుడ్ విలక్షణ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా, ఆర్. రత్నవేలు ఐఎస్‌సి అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో చరణ్ లుక్ ఊహించని విధంగా ఆకట్టుకోగా. ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని, అంచనాలను మరో మెట్టుకు తీసుకెళ్లింది. రీసెంట్‌గా ‘పెద్ది’ చిత్రం నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 6న ఈ గ్లింప్స్ విడుదలవుతున్నట్లు అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేయగా.. తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతుంది..
Also Read: Keerthi Suresh : బాలీవుడ్ లో మరో ఆఫర్ అందుకున్న కీర్తి సురేష్..
ఈ సినిమా ఆడియో హక్కులపై రీసెంట్ గా ఓ వార్త వైరల్ అవుతోంది. భారీ రీచ్ ఉన్న ‘టీ సిరీస్’ కు ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకి అమ్ముడు పోయినట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ‘పెద్ది’ పాన్ ఇండియా భాషల ఆడియో హక్కులు టీ సిరీస్ వారు ఏకంగా రూ.35 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ రావాల్సి ఉన్నాయి. బుచ్చిబాబు ట్యాలెంట్ ఎంటో మనకు తెలిసిందే.. ‘పెద్ది’ టైటిల్ తోనే నమ్మకం సంపాదించుకున్నాడు. ఈ మూవీ కనుక మంచి హిట్ అయితే బుచ్చిబాబు కెరీర్ మారిపోతుంది.