Sanoj Mishra : కుంభమేళా మోనాలిసాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా కేసులో భారీ ట్విస్ట్ నెలకొంది. ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి తనకు సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని సనోజ్ మిశ్రా మోసం చేశాడని.. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే అమ్మాయి షాకింగ్ నిజాలు వెల్లడించింది. సనోజ్ మిశ్రా అమాయకుడు అని.. అతను తనను రేప్ చేయలేదంటూ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ కేసులో ఆయన్ను కావాలనే ఇరికిస్తున్నారంటూ ఆమె చెప్పడం సంచలనం రేపుతోంది.
Read Also : Keerthi Suresh : బాలీవుడ్ లో మరో ఆఫర్ అందుకున్న కీర్తి సురేష్..
ఈ మేరకు ఆమె మాట్లాడిన ఐదు నిముషాల వీడియోను రిలీజ్ చేశారు. తాను సనోజ్ మిశ్రాతోనే ఉంటున్నానని ఆ వీడియోలో ఆమె తెలిపింది. తమ ఇద్దరికీ గొడవలు అయిన విషయం వాస్తవమే కానీ.. సనోజ్ ఎప్పుడూ తనపై అత్యాచారం చేయలేదంటూ ఆమె పేర్కొంది. దీంతో ఈ కేసులో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సనోజ్ మిశ్రా ఎలాంటి తప్పు చేయకపోతే ఆమె కేసు ఎందుకు పెట్టిందనే విషయం మాత్రం ఆమె చెప్పలేదు. ఈ కేసులో ఇప్పటికే సనోజ్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. మోనాలిసాకు ఆయన తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో ఆయన గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.