టాలీవుడ్ లో మరే ఇతర ఇండస్ట్రీలో లేనంతమంది యంగ్ హీరోలు ఉన్నారు. విజయ్ దేవరకొండ, రామ్, అఖిల్, శర్వానంద్, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, నితిన్, ఇలా చాంతాండంత లిస్ట్ ఉంది. కానీ వీరిలో ఎంత మంది ట్రెండ్ తగ్గట్టు కాలానికిఅనుగుణంగా సినిమాలు చేస్తున్నారు, మార్కెట్ ను పెంచుకుని వెళ్తున్నారు అంటే టక్కున చెప్పాలేని పరిస్థితి. అందుక్కారణం వారు చేస్తున్నసినిమాలనే చెప్పాలి. ఓక సినిమా హిట్ కొడితే వెంటనే హ్యాట్రిక్ ప్లాపులు కొడుతున్నారు సదరు హీరోలు.
Also Read : Bollywood : టాలివుడ్ ప్లాప్ దర్శకుడితో సల్మాన్ ఖాన్ సినిమా.?
ఒకప్పుడు సూపర్ హిట్స్ కొట్టి ఇప్పుడు హిట్ కోసం తంటాలు పడుతున్న కొందరి గురించి చర్చింకుకోవాలి. గీత గోవిందం విజయ్ దేవరకొండ చివరి హిట్. మళ్ళి ఆ రేంజ్ సక్సెస్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇచ్చాడు రామ్. శర్వానంద్ అప్పుడెప్పుడో శతమానం భావతి తర్వాత హిట్ మాట వినలేదు. విశ్వక్ సరైన హిట్ కొట్టి ఎన్నేళ్లవుతుందో. ఇక నితిన్ సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అక్కినేని వారసుడు అయ్యగారి సంగతి సరేసరి. ఈయన హిట్ కొట్టేవరకు రీరీరీ లాంఛ్ అవుతూనే ఉండేలా ఉన్నాడు. ఇంకా చాలా మంది ఇతర హీరోలది ఇదే పరిస్థితి.
ఒక హిట్ రాగానే అదే జోనర్ లో సినిమాలు చేయడం లేదా కాంబినేషన్స్ వెంట పరుగులు తీయడం. ఒకసారి జరిగేదాన్ని మ్యాజిక్ అంటారు అలాఅని అదే ప్రతిసారి చేస్తా అంటే పొమ్మంటారు. ఇక్కడ హీరోలు తెలుసుకోవాల్సింది అదే. కాంబినషన్స్ కాదు కొత్త కథలు మీద ఫోకస్ చేయాలి. సరికొత్త జానర్ లు ట్రై చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే నేచురల్ స్టార్ నానిని చూసి నేర్చుకోవాలి. ప్లాపులు వచ్చిన అంటే సుందరం, జెర్సీ, వి వంటి సినిమాలు చేస్తూ నాని అంటే ఎదోఒక కొత్తదనం ఉంటదని ఆడియెన్స్ మైండ్ ని సెట్ చేసి దసరా, సరిపోదా శనివారం వంటి మాస్ కంటెంట్ డెలివరీ చేసి హిట్స్ కొట్టాడు. అలాగే మధ్యలో హాయ్ నాన్న వంటి క్లాస్ హిట్ ఇచ్చాడు. ఇలా మిగిలిన హీరోలు ఆలోచించాల్సిన టైమ్ వచ్చింది. రొటీన్ సినిమాలు చేస్తామంటే ఇక్కడ ఆడియెన్స్ పొమ్మంటారు. అలాగే మాస్.. మాస్.. మాస్.. అనే జపం ఆపేసి కాంబినేషన్స్ పిచ్చి తగ్గించి, ట్రెండ్ ని ఫాలో అయ్యే యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలి. లేదంటే ఒక హిట్ కొట్టి ఆ తర్వాత హిట్ ఇవ్వలేక కనుమరుగు అయిన హీరోల జాబితాలోకి ఇప్పటి యంగ్ హీరోలు చేరాల్సివస్తుంది.